• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంగిత జ్ఞానం ఉందా?: వైసీసీ సర్కారుపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు రాష్ర్టంలో భారీ వర్షాలు, వరదలతో పరిస్థితులు అస్తవ్యవస్తంగా ఉంటే ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుందని ఆయన ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ర్టం లో అరాచక పాలన నడుస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్. ఓ వైపు భారీ వర్షాలతో వరదల భీభత్సంతో ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే, ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలి రోడ్డున పడ్డారన్నారు. పశునష్టం, పంట నష్టం జరిగిందని వరద నివారణ చర్యలను ప్రభుత్వం ప్రారంభించలేదని ఆయన విమర్శించారు.

 Pawan Kalyan slams AP govt for floods issue.

మరో వైపు పచ్చని పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే ఈ సమయంలో ఇసుక అమ్ముతాం అంటూ ప్రకటనలు ఇస్తున్నారని, ఈ ప్రభుత్వానికి ప్రజా క్షేమం అక్కరలేదా అంటూ ప్రశ్నించారు జనసేనాని. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై వ్యక్తిగత దాడులకు దిగుతూ దూషిస్తున్నారని ఇది సమంజసం కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించు కోవాలన్నారు.రాష్ర్టం ఓ వైపు వరదలతో సతమతమ వుతుంటే మరోవైపు ఇసుక అమ్మకాలకు ప్రకటనలు ఇవ్వడం ప్రభుత్వ లాభా పేక్షకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇంతకన్నా హేయమైన చర్య ఇంకొకటి ఉండదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్

ఇది ఇలావుండగా, ఇటీవల చంద్రబాబు కన్నీటిపర్యంతమైన విషయంలోనూ వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ఒకపక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.

తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టడం బాధాకరం. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు, చివరికి టి.వి. చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోంది. గౌరవనీయ ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయం.

  అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Oneindia Telugu

  ఈ వ్యాఖ్యలు నిర్హేతుకంగా ఖండించదగినవి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి కుటుంబసభ్యులను తక్కువచేసి కొందరు మాట్లాడినప్పుడు ఆనాడు కూడా ఆ వ్యాఖ్యలను ఇదే రీతిలో ఖండించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠలకు హాని కలిగించడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉంది. లేని పక్షంలో ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉంది. రాజకీయ వ్యవస్థను ప్రజల దృష్టిలో పలుచన చేయవద్దని ఈ సందర్భంగా కోరుతున్నాను.

  English summary
  Pawan Kalyan slams AP govt for floods issue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X