• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అప్పటి వరకు జగన్ రెడ్డి అనే పిలుస్తా: మోదీ దగ్గరికెళ్లి హోదా అడిగే ధైర్యం లేదు: సీఎంపై పవన్ ఫైర్..!

|

ముఖ్యమంత్రి ఇలాకా లోనే సీఎం జగన కు జనసేనాని హెచ్చరికలు చేసారు. జగన్ తాను ఉన్న హోదాకు తగినట్లుగా మాట్లాడితే..గౌరవంగా వ్యవహరిస్తే తాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అంటూ సంబోధిస్తానని..అప్పటి వరకు జగన్ రెడ్డి..అంటూనే మాట్లాడుతానని..ఇందులో వెనక్కు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఇద విషయాన్ని వైసీపీ నేతలు జగన్ రెడ్డికి చెప్పాలని సూచించారు. రాయలసీమ సంపద జగన్ రెడ్డిది కాదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి హోదా గురించి అడిగే ధైర్యం జగన్ రెడ్డికి లేదని ఎద్దేవా చేసారు. భారతి సిమెంట్ కంపెనీ గురించి ఉన్న శ్రద్ద రాయలసీమలో ఉపాధి కల్పన మీద లేదని విమర్శించారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల విషయంలో జగన్ వాదనను తప్పు బట్టారు. రైల్వే కోడూరులోనే స్థలం తీసుకుంటానని ప్రకటించారు. వైసీపీ నేతల్లోనూ తన అభిమానులు ఉన్నారన్నారు.

జగన్ ఇలాకాలో పవన్ సత్తా చాటేనా: సీఎం లక్ష్యంగా సీమ పర్యటన: బాలకృష్ణ అడ్డాలోనూ..!జగన్ ఇలాకాలో పవన్ సత్తా చాటేనా: సీఎం లక్ష్యంగా సీమ పర్యటన: బాలకృష్ణ అడ్డాలోనూ..!

 మీరు గౌరవిస్తేనే..లేకుంటే జగన్ రెడ్డి అనే అంటాను..

మీరు గౌరవిస్తేనే..లేకుంటే జగన్ రెడ్డి అనే అంటాను..

కడప గడ్డ నుండి ముఖ్యమంత్రి జగన్ ను జనసేన అధినేత పవన్ తన విధానం ఏంటో తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి గౌరవంగా ఉంటే..తానూ గౌరవిస్తానని..కొందరికే సీఎంగా ఉంటూ..అగౌరవంగా మాట్లాడితే తాను జగన్ రెడ్డి అంటూ..ఇలాగే మాట్లాడుతానంటూ స్పష్టం చేసారు. ఈ విషయంలో తాను మాట మర్చుకొనేది లేదని తేల్చి చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ రాయలసీమలో చీనీ చెట్లు..బత్తాయి చెట్లను నరుకుతున్నారని..తమను నరుకుతారని అక్కడి ప్రజలు భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక్కడి యువతో ధైర్యం నింపటానికే జనసేన ఉందని అభయమిచ్చారు. రాయలసీమలో జగన్ రెడ్డి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారని..అయినా సీమలో వెనుకబాటు తనం ఉందన్నారు. ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీమ నేతలు కబ్జాలు చేస్తున్నారని..వారి కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని..ఇవి ప్రభుత్వానికి కనపించవని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా అడిగే ధైర్యం లేదు..

ప్రత్యేక హోదా అడిగే ధైర్యం లేదు..

జగన్ రెడ్డికి..ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ప్రత్యక హోదా అడిగే ధైర్యం లేదని పవన్ కళ్యాన్ ఎద్దేవా చేసారు. 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎవరినైనా ఏమన్నా స్పందించవద్దని ..అందరూ కలిసి కట్టుగా కంటి చూపుతోనే వారి గుండెల్లో వణుకు పుట్టించాలని సూచించారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల గురించి జగన్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నారని..తమిళం తెలిస్తే చెన్నై వెళ్లి వ్యాపారం చేసుకుంటారని..హిందీ తెలిస్తే ఉత్తరాదికి వెళ్తారని చెబుతూనే..దేశంలో ఉన్న అన్ని భాషలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ ఉన్న యువత అరుపులు..కేకల కోసం కాదని..గుండెల్లో ధైర్యం నింపటానికే జనసేన ఉందన్నారు. తాను రైల్వే కోడూరులో స్థలం తీసుకుంటానని..మీకు ధైర్యం ఇవ్వటానికి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. తొలి తెలుగు శిలాఫలకం పులివెందులకు 20 కిలో మీటర్ల దూరంలోనే ఉందని పవన్ గుర్తు చేసారు. రాయలసీమకు ఉక్కు కర్మాగారం కావాలని..అయితే సీమలో అణుశుద్ది కర్మాగారం కావాలంటూ జగన్ రెడ్డి వెళ్లి ప్రధానిని కోరారని వివరించారు. ఎందుకు కోరారో ఆయనే చెప్పాలని..వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దానికి అనుమతి వస్తే దిన దిన గండంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పుడుతుందన్నారు.

ఎంతకాలం బెదిరిస్తారు..తిరిగి కొట్టలేమా

ఎంతకాలం బెదిరిస్తారు..తిరిగి కొట్టలేమా

రాయలసీమలో కొందరు నేతలు బెదిరిస్తున్నారని..ఎంత కాలం బెదిరిస్తారని..వారు కొడితే తిరిగి కొట్టలేమా అని పవన్ ప్రశ్నించారు. కడప జిల్లాలో భారతీ సిమెంట్ గురించి ఉన్న శ్రద్ద మిగిలిన వాటి మీద జగన్ రెడ్డికి లేదన్నారు. తనకు భారతీ సిమెంట్ లాంటి కంపెనీలు లేవని..తాను రైతుల తరపున పోరాటం చేస్తానని స్పష్టం చేసారు. తనకు వైసీపీ నేతల మీద ద్వేషం లేదన్నారు. వైసీపీలో తన అబిమానులు ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డిని హుందాగా మాట్లాడమని చెప్పండని.. అదే సమయంలో ఏపీకి పరిశ్రమలు తేవాలని సూచించాలని వైసీపీ నేతలకు సూచించారు.

English summary
Janasena Chief pawan Kalyan slams CM Jagan in Railway koduru meeting. Pawan says CM Jagan can not dare to ask Pm Modi onspecial stauts for Ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X