అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు స్పెషల్ అల్పాహారం, పరిటాల సునీత స్వయంగా చేయించారు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‍ ఆదివారం మంత్రి, టిడిపి నేత పరిటాల సునీత ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. బ్రేక్ ఫాస్టుగా రాగిముద్ద, పల్లీల చట్నీని వడ్డించారు. పవన్‌కు అల్పాహారం నిమిత్తం పరిటాల సునీత దగ్గర ఉండి మరీ వంటకాలు సిద్ధం చేయించారు.

Recommended Video

పరిటాల ఇంటికి పవన్, గుండు కొట్టించడంపై సునీత

కదిరి చౌరస్తాలో అభిమానులనుద్దేశించి పవన్ కళ్యాణ్ ఇలాకదిరి చౌరస్తాలో అభిమానులనుద్దేశించి పవన్ కళ్యాణ్ ఇలా

రాగి ముద్దతో పాటు ఇడ్లీ, వడ, దిబ్బరొట్టె, పొంగల్, రాగి సంకటిని చేయించారు. వీటితో చట్నీ, సాంబర్, కారంపొడి, నెయ్యి తదితరాలను సిద్ధం చేశారు. పరిటాల కుటుంబం, మరికొందరితో పాటు పవన్ అల్పాహారం తీసుకున్నారు. అల్పాహారం తీసుకునే సమయంలో ఆ తర్వాత పవన్, పరిటాల సునీత పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది.

Pawan Kalyan Speaks to Media After Meeting with Paritala

కాగా, ఆ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. అధికార పక్షంలో ఉన్న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో ప్రజల ముందు తప్పు ఒప్పుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

ఆసక్తికరం: పరిటాల ఇంటికి పవన్, ఎదురెళ్లిన శ్రీరామ్, 'తెలంగాణ ఇష్యూలా కావొద్దు'ఆసక్తికరం: పరిటాల ఇంటికి పవన్, ఎదురెళ్లిన శ్రీరామ్, 'తెలంగాణ ఇష్యూలా కావొద్దు'

ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే పరిస్థితులు ఉండకపోవచ్చునని ఆ విషయం ప్రజలకు చెప్పాలన్నారు. అన్నం ముద్ద సాక్షిగా, రాగి ముద్ద సాక్షిగా అనంతపురంకు, రాయలసీమకు అండగా ఉంటానని చెప్పారు.

English summary
Janasena chief Pawan Kalyan has met Paritala's family on 2nd day of his Anantapur tour to discuss about drought conditions in Anantapur and the possible solutions to solve it. Paritala Sunitha and Irrigation Engineer has explained PK about the prevailing conditions and the projects are likely to be completed in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X