వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయమెందుకు?: టీడీపీ, జగన్ పార్టీలపై పవన్ కీలక వ్యాఖ్యలు: జేఎఫ్‌సీకి ‘ఏపీ సర్కారు’ నివేదిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కేంద్రం ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నిధుల కేటాయింపుపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో రెండు రోజుల(శుక్రవారం, శనివారం)పాటు నిర్వహించిన జేఎఫ్‌సీ మేధోమథన సమావేశం విజయవంతమైంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు.

ఎంపీలకు భయమెందుకో?

ఎంపీలకు భయమెందుకో?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెట్టారని, రాష్ట్ర ఎంపీలు సరిగా పోరాటం చేయకపోవడంతోనే ప్రత్యేక హోదా రాలేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఎవరి వ్యక్తిగత సమస్య కాదన్నారు. కేంద్రాన్ని నిలదీసేందుకు ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలియడం లేదన్నారు.

మేం పోరాడుతాం

మేం పోరాడుతాం

‘ప్రత్యేక హోదా, హామీల అమలు విషయంలో మేం ఎందుకు ఇంత గట్టిగా పోరాడుతున్నామంటే.. అప్పట్లో రాజకీయ అనుభవజ్ఞులు కొద్దిమంది అనుకుని ఆంధ్రా, తెలంగాణలను కలిపారు. తెలంగాణకు అండంగా నిలబడతాం' అని పవన్ చెప్పారు. అయితే వాటిని పాటించకపోవడం వల్ల దశాబ్దాల పాటు సమస్య పేరుకుపోయి జఠిలమై, తెలంగాణను విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇలాగే మభ్యపెడితే ప్రజల్లో విసుగు వచ్చేస్తుంది' పవన్ వ్యాఖ్యానించారు.

ప్రజలు మాత్రం నష్టపోతున్నారు...

ప్రజలు మాత్రం నష్టపోతున్నారు...

‘యూపీఏ హయాంలో కూడా ఎంపీలు సరిగా స్పందించలేకపోయారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు. ఒకవేళ దానిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా, వాళ్లంటే అందరికీ భయం ఉండేది. వారి వ్యక్తిగత సమస్యల కారణంగా, ఆశల వల్ల, తమకు అవకాశాలు దక్కవేమోనన్న భయంతో కేంద్రాన్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం చేయలేదు. అప్పుడు యూపీఏలో అదే జరిగింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కూడా అదే జరుగుతోంది. దీనివల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొందవచ్చేమో కానీ, అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రజలు' అని పవన్ వ్యాఖ్యానించారు.

తప్పు జరిగిపోయింది..

తప్పు జరిగిపోయింది..

‘ఒకసారి ఒక తప్పు జరిగిపోయింది. విడివిడిగా ఉన్న రెండు రాష్ట్రాలను కలిపారు. ఈ పరిస్థితుల్లో కలిసి ఉంచవచ్చని రకరకాల వాగ్దానాలు చేశారు. అవి చేయలేకపోయే సరికి ‘జైఆంధ్రా'ఉద్యమం వచ్చింది. దానిలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలు కోల్పోయారు. అది సమసిపోయిందనుకున్నారు'అని పవన్ చెప్పారు.

ఇంత చేస్తే! మోడీపై విమర్శలా? ప్రశంస వద్దు కానీ, గుర్తించండి: హరిబాబు ఏకరువు, పవన్ కమిటీపై ఇలాఇంత చేస్తే! మోడీపై విమర్శలా? ప్రశంస వద్దు కానీ, గుర్తించండి: హరిబాబు ఏకరువు, పవన్ కమిటీపై ఇలా

నివురుగప్పిన నిప్పులు.. ఇది మొదటిమెట్టు

నివురుగప్పిన నిప్పులు.. ఇది మొదటిమెట్టు

‘అయితే నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆ(తెలంగాణ) ఉద్యమం బద్దలై 10లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి ‘మా రాష్ట్రం మాకు కావాలి. మీరంతా వెళ్లిపోండి'అనే పరిస్థితికి దారితీసింది. రాజకీయ నాయకులు చేసిన తప్పులకు శిక్షను ప్రజలు అనుభవిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం జరిగిన ఈ సమస్య ఇప్పుడు విద్యార్థులకూ తగిలే పరిస్థితికి వచ్చింది. ఇంకోసారి ఆ తప్పు జరగకుండా భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే ఖచ్చితమైన ఆలోచనా విధానంతో వెళ్తున్నాం. అందుకు ఇది మొదటి మెట్టు' అని అన్నారు.

టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి ఉంటే..

టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి ఉంటే..

‘ఈ సమావేశంలో తెలంగాణ గురించి కూడా చర్చ వచ్చింది. అయితే ఇంకా విస్తృతంగా చూడాల్సి ఉంది. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ఏపీకి చాలా ఇస్తామన్నారు. తెలంగాణకు మేజర్‌గా ఇవ్వాల్సినవి ఇచ్చేశారు. అయితే, తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. దానిపై ప్రమోద్‌ బృందంగా కూర్చుని వాటిని కూడా జత పరుస్తారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీలకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయవచ్చు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు' అని ఓ ప్రశ్నకు సమాధానంగా పవన్‌ అన్నారు.

పవన్‌‘జేఎఫ్‌సీ'పై నమ్మకం లేదు, క్షమాపణ చెప్పండి: టీడీపీకి జీవీఎల్ వార్నింగ్పవన్‌‘జేఎఫ్‌సీ'పై నమ్మకం లేదు, క్షమాపణ చెప్పండి: టీడీపీకి జీవీఎల్ వార్నింగ్

నివేదిక వచ్చిన తర్వాతే డెడ్‌లైన్.. వైసీపీ గురించి తెలియదు

నివేదిక వచ్చిన తర్వాతే డెడ్‌లైన్.. వైసీపీ గురించి తెలియదు

వైసీపీ డెడ్ లైన్ ఎందుకు పెట్టిందో తమకు తెలియదని పవన్ వ్యాఖ్యానించారు. జేఎఫ్‌సీ నివేదిక వచ్చిన తర్వాత తాము డెడ్ లైన్ చెబుతామని అన్నారు. జాతీయస్థాయి విద్యా సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అప్పటికే ఉన్న ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పెట్టేస్తే కొత్తదనం ఏముంటుందని పవన్ ప్రశ్నించారు. రెండో రోజు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రశేఖర్‌లతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ విభజన హామీల అమలుపై సమావేశంలో చర్చించింది. అమరావతిలో ప్రైవేటు కళాశాలలకు 200 ఎకరాల స్థలం లభించింది కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో స్థాపించాల్సిన ఐఐఎంకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించలేదని, ఇప్పుడున్న ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే ఐఐఎంను నడుపుతున్నారని పవన్‌ అన్నారు.

ప్రజలను పిచ్చోళ్లనుకుంటున్నారా?: టీడీపీ-బీజేపీపై తమ్మారెడ్డి ఆగ్రహం, ‘కేటీఆర్‌కు థ్యాంక్స్' ప్రజలను పిచ్చోళ్లనుకుంటున్నారా?: టీడీపీ-బీజేపీపై తమ్మారెడ్డి ఆగ్రహం, ‘కేటీఆర్‌కు థ్యాంక్స్'

జేఎఫ్‌సీకి లెక్కల నివేదిక

జేఎఫ్‌సీకి లెక్కల నివేదిక

పవన్ కళ్యాణ్ లెక్కలు అడిగిన నేపథ్యంలో ఏపీ సర్కారు.. శనివారం జేఎఫ్‌సీకి నివేదిక పంపింది. రాష్ట్ర ప్రభుత్వ మెసెంజర్ల ద్వారా 118పేజీల నివేదికను పంపింది. విభజన చట్టంలోని అంశాలు, ప్యాకేజీ వివరాలను నివేదికలో పేర్కొంది. ఐఏఎస్‌ల ద్వారా నివేదిక పంపే పరిస్థితి ఉత్పన్నం కాదని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. బడ్జెట్‌కు ముందు ప్రధానికి ఇచ్చిన వివరాలను కూడా నివేదికలో సర్కారు పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నివేదిక పంపుతున్నామని సర్కారు స్పష్టం చేసింది.

కౌన్సిలర్‌గా కూడా గెలవవు!: సోము వీర్రాజు, బీజేపీపై బోండా సంచలన వ్యాఖ్యలుకౌన్సిలర్‌గా కూడా గెలవవు!: సోము వీర్రాజు, బీజేపీపై బోండా సంచలన వ్యాఖ్యలు

English summary
Janasena president Pawan Kalyan responded on special status after JFC meet on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X