వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంను చేయండి, చొక్కాపట్టి నిలదీయండి: పవన్ కళ్యాణ్, సిగ్గు-లజ్జా అంటూ టీడీపీపై

|
Google Oneindia TeluguNews

కాకినాడ: అవినీతి పాలన అందించడమే జనసేన పార్టీ లక్ష్యమని, అందరికీ అండగా నిలుస్తామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వద్దకు బాంచన్ అంటూ వెళ్లి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

బాబూ! 2014లో కాంగ్రెస్‌తో కలవాల్సింది, షర్మిల చేయించారా?: జగన్ మీద దాడిపై పవన్ కళ్యాణ్బాబూ! 2014లో కాంగ్రెస్‌తో కలవాల్సింది, షర్మిల చేయించారా?: జగన్ మీద దాడిపై పవన్ కళ్యాణ్

ప్రత్యేక హోదా, హామీల అమలుకు ఉమ్మడి ప్రణాళికతో కేంద్రం మెడలు వంచుదామన్నారు. ప్రజలు బలమైన మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అనుభవం కోసం తాను 2009, 2014లో పోటీ చేయలేదని చెప్పారు. 2003లోనే అమ్మతో ప్రజలకు ఏదైనా చేసేందుకు రాజకీయాలు అంటే మనకు ఎందుకని తన తల్లి చెప్పిందని, ఇప్పుడు 2018లో నా తల్లి తనను దేశానికి దత్తత బిడ్డ అని చెప్పిందని అన్నారు.

చిరంజీవి, నాగబాబే నాకు సోదరులు కాదు.. మీరంతా కూడా

నీది జగమంత కుటుంబం, ఆ కుటుంబాన్ని చూసుకోమంటూ తన తల్లి తనను ఆశీర్వదించిందని, రూ.4 లక్షలు పార్టీ కోసం ఇచ్చిందని పవన్ చెప్పారు. చిరంజీవి, నాగబాబు మాత్రమే తనకు అన్నదమ్ములు కాదని, మీరంతా (ప్రజలు) నా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు అన్నారు. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చినప్పుడు మీ కోసం నేను ఏమీ చేయకుంటే ఎందుకన్నారు. జానీ సినిమా తర్వా వ్యవసాయం చేశానని, రైతు కష్టాలు తెలుసునని చెప్పారు.

పౌరుషం లేదా

చంద్రబాబు 2014లో హామీలు ఇచ్చినప్పుడు.. అన్ని హామీలు అమలు చేయగలరా అని రాజస్థాన్ సీఎం అన్నారని, కానీ అనుభవజ్ఞుడు కాబట్టి చేస్తానని భావించానని పవన్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులు ఉంటాయి కానీ, ప్రజా సమస్యలు పట్టించుకోరా అని ప్రశ్నించారు. విభజన సమయంలో మీ ఎంపీలను చితక్కొట్టిన కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు టీడీపీకి సిగ్గు లేదా, పౌరుషం లేదా అని ప్రశ్నించారు.

మీ ఎంపీని చితక్కొట్టారు.. సిగ్గుందా?

మీ ఎంపీ కొనకళ్ల నారాయణను చితక్కట్టారని, శివప్రసాద్‌ను రక్తం వచ్చేలా కొరడాతో కొట్టుకున్నారని, ఇప్పుడు ఆ పార్టీతో కలుస్తారా అని పవన్ ప్రశ్నించారు. ఆంధ్రులను అవమానించినందుకు కాంగ్రెస్ వాళ్లే సిగ్గుపడుతున్నారని, వాళ్లు మిమ్మల్ని ఛీ.. ఛీ అంటే మీకు మాత్రం రా.. రా అన్నట్లుగా వినిపిస్తోందా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లకు సిగ్గు, లజ్జ అనే మాటలకు అర్థం తెలుసా అన్నారు. నాడు అంజయ్యను అవమానించినందుకు టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని, ఇప్పుడు రాహుల్ గాంధీ మోకాళ్లకు మొక్కి బాంచన్ అంటారా అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

సీఎంగా చేయండి.. చొక్కా పట్టుకొని నిలదీయండి

నన్ను సీఎంగా చేస్తే బాధ్యతగా పని చేస్తానని, బాధ్యతగ పని చేయకుంటా నా చొక్కా పట్టుకొని నిలదీయవచ్చునని పవన్ పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే బాధ్యతగల పాలన అందిస్తామని చెప్పారు. నన్ను యువత సీఎంగా చూడాలని కోరుకుంటోందని చెప్పారు. రాష్ట్రానికి హోదా కావాలంటే జనసేనతో పాటు సీపీఎం, సీపీఐలను పిలవండి, హోదాపై మాట్లాడుదాం.. ఉమ్మడిగా పోరాడుదామని జనసేనాని చెప్పారు.

మోడీతో కొట్లాడే శక్తి జనసేనకే ఉంది

మోడీతో కొట్లాడేందు నైతిక బలం టీడీపీకి లేదని, ఆ శక్తి జనసేనకే ఉందని పవన్ చెప్పారు. తన వియ్యకుండికి కాంట్రాక్టులు ఇప్పించుకోవడంలో చూపిన శ్రద్ధ మంత్రి యనమల హోదాపై చూపించడం లేదన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతారా అని నిలదీసారు. తన వద్ద వేల కోట్లు లేవని, ప్రజల మనసు దోచుకునే ప్రేమ ఉందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకోండని, ఓటు మాత్రం జనసేనకు వేయాలన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan speech at Kathipudi Bahiranga Sabha on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X