అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతపురం టూ శ్రీకాకుళం బస్సు యాత్ర: మూడు నెలల పాటు పవన్ టూర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల 15 వ తేది నుండి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.ఈ బస్సు యాత్రను పురస్కరించుకొని పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది.అనంతపురం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఈ యాత్ర కొనసాగనుంది. తొలి విడత ఎన్నికల ప్రచారంగా ఈ బస్సు యాత్రను పార్టీ నేతలు భావిస్తున్నారు. మే 15వ తేదిన అనంతపురం నుండి వపన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది

ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు తొలి విడత బస్సు యాత్రను మే 15వ, తేది నుండి ప్రారంభించనున్నారు.

టార్గెట్ 2019: ఆవనిగడ్డ నుండి పవన్ పోటీ, ఎందుకో తెలుసా?టార్గెట్ 2019: ఆవనిగడ్డ నుండి పవన్ పోటీ, ఎందుకో తెలుసా?

పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కోసం పార్టీ యంత్రాంగం సన్నాహలు చేపట్టింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కోసం ప్రత్యేకంగా బస్సును కూడ సిద్దం చేశారు.. తొలివిడత ప్రచారంలోనే ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు తమ పార్టీ విధానాలను ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

 అనంతపురం నుండే పవన్ బస్సు యాత్ర

అనంతపురం నుండే పవన్ బస్సు యాత్ర

మే 15వ, తేది నుండి అనంతపురం నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 15వ, తేది ఉదయం 10 గంటలకు పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రను ప్రారంభించనున్నట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి ఈ బస్సు యాత్రను మొదటి విడత ఎన్నికల ప్రచారంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరో వైపు పార్టీ విధానాలను తీసుకెళ్ళేందుకు ఈ బస్సు యాత్రను వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అదే తరుణంలో ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సన్నద్దం చేసేందుకు పవన్ ప్లాన్ చేయనున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాల ఏర్పాటుతో పాటు క్యాడర్‌తో సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు.

అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర

అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర

మే 15న, ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా వరకు కొనసాగనుంది. శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్రను పవన్ కళ్యాణ్ ముగించనున్నారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు బస్సు యాత్రను వేదికగా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు బస్సు యాత్ర కోసం పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

మూడు నుండి నాలుగు నెలల యాత్ర

మూడు నుండి నాలుగు నెలల యాత్ర

అనంతపురం నుండి ప్రారంభమయ్యే బస్సు యాత్ర శ్రీకాకుళంలో ముగించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను సిద్దం చేస్తున్నారు. కనీసం బస్సు యాత్ర మూడు నుండి నాలుగు మాసాల పాటు కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నాలుగు మాసాల పాటు పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బేరీజు వేయనున్నారు.

అభ్యర్ధుల ఫైనల్

అభ్యర్ధుల ఫైనల్

అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర సాగనుంది అయితే ఈ బస్సు యాత్రలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను కూడ పవన్ కళ్యాణ్ ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ప్రతి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలను సిద్దం చేయాలని పార్టీ యంత్రాంగాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బస్సు యాత్ర సందర్భంగా ఆ జాబితాను వపన్ కళ్యాణ్ ఫైనల్ చేసే అవకాశం లేకపోలేదు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటీ, ఏ పార్టీ బలమెంత, ఏ అభ్యర్ధిని బరిలోకి దింపితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనే విషయాలపై పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర సందర్భంగా పార్టీ నేతలతో చర్చించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

English summary
Janasena chief Pawan Kalyna decided to start bus yatra from May 15, 2018. He will be start bus yatra from Anantapur on May 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X