• search
 • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రేపే ప‌వ‌న్ యుద్ద శంఖారావం : హెలికాఫ్ట‌ర్ తో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు : అభ్య‌ర్దుల జాబితా సిద్దం..!

|
  AP Election 2019 : Jansena Election Campaign Date Fixed ! | Oneindia Telugu

  జ‌నసేన అధినేత ఎన్నిక‌ల ప్ర‌చారానికి సిద్ద‌మ‌య్యారు. గురువారం జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సందర్బంగా రాజ‌మండ్రిలో భారీ స‌భ ఏర్పాటు చేసారు. ఆ స‌భ‌కు యుద్ద శంఖారావం పేరు పెట్టారు. ఈ స‌భ ద్వారా ఎన్నిక‌ల ప్ర‌చా రానిని ప‌వ‌న్ శ్రీకారం చుడుతున్నారు. ఇక‌, జ‌న‌సేన అభ్య‌ర్ధుల జాబితా సైతం సిద్ద‌మ‌యింది. తుది మెరుగులు త‌రు వాత ఏ క్ష‌ణ‌మైనా జాబితా విడుద‌ల కానుంది.

  వైసిపి అభ్య‌ర్ధుల జాబితా వాయిదా..16న ఇడుపుల‌పాయ‌లో : అస‌లు కార‌ణం ఏంటంటే..!

  ప్ర‌చారానికి జ‌న‌సేనాని సిద్దం..

  ప్ర‌చారానికి జ‌న‌సేనాని సిద్దం..

  జ‌నసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గురువారం రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభకు యుద్ధ శంఖారావం అని పేరు పెట్టారు. రాజమహేం ద్రవరం సభ అనంతరం ప్రచారం ఉద్ధృతం చేసే యోచనలో పార్టీ అధ్యక్షుడున్నారు. ఈ విషయంపై పార్టీ నాయకుల కూ స్పష్టత ఇచ్చి, ప్రచార ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. రోజుకు 3 చోట్ల ఎన్నికల సభలకు ఏర్పాట్లు చేయాలని పవన్‌ పేర్కొన్నారని సమాచారం. హెలికాప్టర్‌ సాయంతో రాష్ట్రమంతటా చుట్టి రావాలనే యోచనలో ఆయ న ఉన్నారు. దీంతోపాటు రోడ్డు షోలలోనూ ఆయన పాల్గొంటారు.

  16న పొత్తుల పై స్ప‌ష్ట‌త‌..

  16న పొత్తుల పై స్ప‌ష్ట‌త‌..

  మరోవైపు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులను కొలిక్కి తీసుకురావడం, పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడం వంటి వాటిపై పార్టీ నాయకులు దృష్టి సారించారు. వామపక్షాలు కోరిన స్థానాలను యథాతథంగా కేటాయించేందుకు పార్టీ సానుకూలంగా లేదని సమాచారం. జనసేనకు బలం ఉన్న స్థానాలనే వామపక్షాలు ప్రతిపాదిస్తుండటంతో ఈ విష యంపై పార్టీ అధినేత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం పవన్‌ కల్యాణ్‌తో వామపక్ష పార్టీ ల చర్చలు సాగుతాయని భావించినా అనుకోకుండా రద్దయ్యాయి. 16న సమావేశమవుదామని జనసేన కార్యాలయం నుంచి వామపక్ష నాయకులకు వర్తమానం పంపారు. ఆ స‌మ‌వేశంలో సీట్ల స‌ర్దుబాటు పై నిర్ణ‌యం జ‌ర‌గ‌నుంది.

  మేనిఫెస్టో..జాబితా సిద్దం..!

  మేనిఫెస్టో..జాబితా సిద్దం..!

  పార్టీ మేనిఫెస్టోపై నిపుణుల కమిటీ కసరత్తు సాగిస్తోంది. విశ్రాంత ఉన్నతాధికారి నేతృత్వంలో మరో ఇద్దరు నిపుణులు కలిసి మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే జనసేన మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ప్రకటించిం ది. రాజమహేంద్రవరం సభలో పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో పార్టీ అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేసేందుకు రంగం సిద్ద‌మైంది. శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని పవన్‌ కల్యాణ్‌ సోమవారమే ట్వీట్‌ చేశారు. ఆ పేర్లు ఏ స‌మ‌యంలో అయినా వెల్లడించే అవకాశముం ద ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజమహేంద్రవరం, అమలాపురం లోక్‌సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రక టించారు. ముమ్మిడివరం అసెంబ్లీ సీటుకు పితాని బాలకృష్ణ పేరును పార్టీ తొలి అభ్యర్థిగా గతంలోనే వెల్లడించారు. గుంటూరు సభలో నాదెండ్ల మనోహర్‌, తోట చంద్రశేఖర్‌ల పేర్లూ ప్ర‌క‌టించారు. దీంతో..ఇప్పుడు జ‌న‌సేన ఆశావాహు ల్లో ఉత్కంఠ మొద‌లైంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jansena Chief Start his election campaign from 14th of this month . Janasena formation day celebrating at Rajahmundry by name Yudda Sankharavam. Pawan reach public meetings by Helicaftor and conduct road shows.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more