వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన: పార్టీ సమావేశం మధ్యలోనే: అమిత్ షాతో భేటీ..!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అమరావతి లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతన్న సమయంలో ఆయన..హడావుడిగా సమావేశం మధ్యలోనే వెళ్లి పోయారు. ఏపీలో మూడు రాజధానులు వ్యవహారం.. అమరావతి రైతుల ఆందోళన పైన కేంద్రం పెద్దలతో తాను చర్చిస్తానని పవన్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. దీంతో..ఆయనకు ఢిల్లీలో అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లు సమాచారం అందింది. దీంతో..వెంటనే పవన్ హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుండి మధ్నాహ్నానికి ఢిల్లీ చేరుకోనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో ఆయన అప్పాయింట్ మెంట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ టైం సైతం కోరారని..అయితే ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉండటంతో..అమిత్ షా తో భేటీ అవుతారని పార్టీ నేతల నుండి అందుతున్న సమాచారం. ఢిల్లీలో పవన్ నేరుగా అమిత్ షా తో భేటీ ద్వారా అమరావతి అంశంతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో సైతం సమీకరణాలకు మారే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీకి సడన్ గా పవన్ ...

ఢిల్లీకి సడన్ గా పవన్ ...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన రెండు రోజులుగా ఢిల్లీలో ప్రముఖుల అప్పాయింట్ మెంట్ కోరుతున్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశం..అదే విధంగా అమరావతి రైతుల ఆందోళన పైన పవన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని..అఖిలపక్షం అభిప్రాయం తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో తాను కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రంతో చర్చిస్తానని పవన్ స్పష్టం చేసారు. దీంతో..కేంద్రం పెద్దల అప్పాయింట్ మెంట్ కోరారు. కొద్ది సేపటి క్రితం ఆయన అమరావతిలోని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో పవన్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఢిల్లీ నుండి ఆయనకు కీలక వ్యక్తి వద్ద అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లుగా ఫోన్ వచ్చింది. ఆ వెంటనే పవన్ అమరావతి నుండి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి వెళ్తారని..సాయంత్రం ఢిల్లీలో కీలక వ్యక్తులను కలుస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

అమిత్ షా తో భేటీ..!

అమిత్ షా తో భేటీ..!


పవన్ కళ్యాన్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోరగా..ఆయనకు ఖరారైనట్లుగా కాల్ వచ్చిందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పైన తాను అమిత్ షా తో పాటుగా ప్రధానిని కలవాలని అనుకుంటున్నానంటూ బీజేపీ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఏపీకి చెందిన నేత ద్వారా పవన్ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో.. అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోదీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉండటంతో ఆయన అప్పాయింట్ మెంట్ దొరకలేదని తెలుస్తోంది. అమిత్ షా తో పాటుగా ఇతరులను ఎవరని కలుస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అమిత్ షా తో భేటీ సమయంలో ఆయన ఏపీలో రాజకీయ పరిస్థితులతో పాటుగా.. మూడు రాజధానుల వ్యవహారం..అమరావతి రైతుల ఆందోళన పైన చర్చించి వారికి న్యాయం చేసే దిశగా ప్రతిపాదనలు అందించే అవకాశం కనిపిస్తోంది.

సమీకరణాలు మారుతాయా..

సమీకరణాలు మారుతాయా..


పవన్ ఇప్పుడు ఢిల్లీ పర్యటన పైన అనేక అంచనాలు ఉన్నాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత బీజేపీ అంశంలో పవన్ గతం కంటే సానుకూలంగా స్పందిస్తున్నారు. అమెరికాలో జరిగిన తానా సభల సమయంలోనూ పార్టీ నేత రాం మాధవ్ తో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక, కొద్ది రోజుల క్రితం వరకు జనసేన ను ఏ పార్టీలోనూ విలీనం చేసే అవకాశం లేదని పవన్ తేల్చి చెప్పారు. రెండు నెలల క్రితం కూడా పవన్ ఢిల్లీ పర్యటన చేసారు. ఆ సమయంలో బీజేపీ నేతలతో మంతనాలు చేయలేదని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు ఏపీలో సార్వత్రిక ఎన్నికల తరువాత జరగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పవన్ ఢిల్లీ వెళ్లారు. పార్టీ నేతలు చెబుతున్నట్లుగా అమిత్ షా తో భేటీ అయితే..రాజధాని అంశంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ..జనసేన పొత్తుతో స్థానిక సంస్థలు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ సైతం మొదలైంది. అయితే, ఢిల్లీలో పవన్ ఎవరిని కలుస్తారు..ఏం చర్చిస్తారనే దాని పైన మొత్తం సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి.

English summary
Janasena Chief Pawan Kalyan sudden Delhi tour creatiing many speculation in AP Political circles. As per party sources He gor Amit Shah appointment to day night. Pawan may discuss on Amaravati and Ap political issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X