విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ సడన్‌గా యూటర్న్: సీఎం, 'చంద్రబాబును తక్కువగా అంచనా వేయొద్దు, తిప్పేయగలరు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయనగరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. విజయనగరం జిల్లా జమ్మాదేవిపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు.

షాకింగ్.. ఇగో వదిలేయండి: చంద్రబాబుపై మమత ఒత్తిడి, సోనియా గాంధీ సిద్ధం? జగన్‌పై దీదీ ఇలాషాకింగ్.. ఇగో వదిలేయండి: చంద్రబాబుపై మమత ఒత్తిడి, సోనియా గాంధీ సిద్ధం? జగన్‌పై దీదీ ఇలా

Recommended Video

పవన్‌పై టీడీపీ నేతల భిన్న స్పందన!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని చెప్పారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటించారు. రాజీనామాలు ఆమోదించకుంటే డ్రామాలుగా భావించవలసి ఉంటుందన్నారు. విపక్షాలకు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు.

పవన్ కళ్యాణ్ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు

పవన్ కళ్యాణ్ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు

ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ తనను, టీడీపీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్న జనసేనాని హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. హఠాత్తుగా ఆయనలో ఎందుకు మార్పు వచ్చిందో చెప్పాలన్నారు.

పవన్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

పవన్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

పవన్ కళ్యాణ్ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితులు లేవని చెప్పారు. కమలం పార్టీతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీకి ద్రోహం చేస్తోందన్నారు. అలాంటి పార్టీలను ఉపేక్షించవద్దని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబును తక్కువగా అంచనా వేయవద్దు

చంద్రబాబును తక్కువగా అంచనా వేయవద్దు

ఇదిలా ఉండగా, మన సభలకు జనం వస్తున్నారని 2019లో అధికారం మనదే అనే మితిమీరిన విశ్వాసానికి పోవద్దని, జగన్‌ కష్టాన్ని అందరికీ వివరిస్తేనే ఎన్నికల్లో విజయం సాధిస్తామని వైసీపీ నేత అంబటి రాంబాబు కార్యకర్తలతో అన్నారు. చంద్రబాబును తక్కువగా అంచనా వేయొద్దని బలమైన వ్యూహంతో ప్రజలను తనవైపు తిప్పుకోగలడన్నారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసిన ప్రతిపక్ష నేత సీఎం అయ్యే సంప్రదాయం ఉందని, గతంలో పాదయాత్ర చేసిన వైయస్, చంద్రబాబులు సీఎంలు అయ్యారన్నారు. ఇప్పుడు జగన్‌ ఆ వరుసలో ఉన్నారన్నారు.

ముగ్గురూ మోసం చేశారు

ముగ్గురూ మోసం చేశారు

హోదా మాట ఎత్తితే కేసులు పెడతానని హెచ్చరించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి మోడీ మోసం చేశాడని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని అంబటి విమర్శించారు. నరేంద్ర మోడీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు.. ముగ్గురు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Monday said that Jana Sena chief Pawan Kalyan is took U turn and blaming me now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X