వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఆ ఛానెల్ టేకోవర్ చేస్తున్నారా?... ఇదే ఫైనల్ అంటున్నారు!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

పవన్ కళ్యాణ్ టివి ఛానెల్ గురించిన వార్తలు మరోసారి తెరమీదకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కొత్త ఛానల్ కాకుండా రెండు కమ్యూనిస్టు పార్టీలు నడిపిస్తున్న రెండు ఛానెళ్లలో ఒక దాన్ని తీసుకోవాలని తీసుకోవాలని ఆల్రెడీ డిసైడ్ చేసేశారని టాక్.

ముందు కొత్త ఛానెల్ పెట్టాలనుకోవడం అయితే సమయా భావం కారణంగా ఆ నిర్ణయం మార్చుకోవడం...ఆ తరువాత కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఛానెల్ పెట్టాలనుకుని ఎక్విప్ మెంట్ తెప్పించినా తెర మీదకు రప్పించలేక పోయిన ఆ ఛానెల్ ను తాము నడిపిద్దామని చూడటం, అదీ కాదని ఇప్పుడు ఫైనల్ గా ఆల్రెడీ నడుస్తున్న ఒక కమ్యూనిస్ట్ ఛానెల్ ను టేకోవర్ చేద్దామని నిర్ణయించడం జరిగిందట...ఇక వేరే ఆలోచనలు లేవని ఈ ఛానెల్ ను తమ జనసేనకు అండగా నడపాలని పవన్ కళ్యాణ్ ఫిక్సయ్యారనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన టాక్!

కమ్యూనిస్ట్ ఛానెల్...టేకోవర్

కమ్యూనిస్ట్ ఛానెల్...టేకోవర్

రాష్ట్రంలో రెండు ప్రధాన వామపక్ష పార్టీలకు ఎప్పట్నుంచో రెండు న్యూస్ పేపర్లు ఉండగా, ఆ తరువాత మారిన కాలానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒకటి ఉండాలని అదే రెండు కమ్యూనిస్ట్ పార్టీలు రెండు ఛానెళ్లు పెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటైన 10 టివి కాకుండా మరో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఛానెల్ ను ఇప్పుడు జన సేన తమ ఆధీనంలోకి తీసుకోబోతోందట.

ఫైనల్...అంటున్నారు

ఫైనల్...అంటున్నారు

నిర్వహణా భారం భరించే విషయమై పలు చేతులు మారిన ఈ టివి ఛానెల్ తమ అంకెల పేరు మార్చుకొని జె అనే ఇంగ్లీష్ అక్షరంతో జన సేన రాగం ఆలపించబోతోందని అంటున్నారు. అయితే ఈ ఛానెల్ ను తాము తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై కూడా చర్చల మీద చర్చలు జరిపిన జనసేన ముఖ్యలు ఆర్థిక కోణంలో కూడా ఛానెల్ నడిపే విషయం గురించి లెక్కలు వేశారట. పవన్ తరుపున విజయవాడకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఈ ఛానెల్ నిర్వహణా బాధ్యతలు తాను చూస్తానని భరోసా ఇచ్చారని అంటున్నారు.

సిబ్బంది మార్పు...అనివార్యమేనా?

సిబ్బంది మార్పు...అనివార్యమేనా?

ఇక ఆ తరువాత ఇందులో పాత స్టాఫ్ నే కొనసాగిస్తారా? లేక వారి స్థానంలో అందరినీ కొత్త వారిని తీసుకుంటారా అనే విషయం పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటున్నారు. అయితే టెక్నికల్ సిబ్బంది ఎక్కువమందిని పాతవారినే ఉంచినా పాత్రికేయ బృందంలో మాత్రం భారీ మార్పులు ఉండటం ఖాయమంటున్నారు.

అభిమానుల ఆనందం

అభిమానుల ఆనందం

మరోవైపు జన సేన తరుపున ఛానల్ రాబోతుందన్న వార్తలు మాత్రం ఇటు పవన్ కల్యాణ్ అభిమానులను, అటు జనసేన పార్టీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తుతున్నాయని తెలిసింది. తమ పవర్ స్టార్ కు ఇప్పుడు మీడియా అండ అవసరమని, ఆయన మీడియా రంగంలో కూడా అద్భుత విజయాలు సాధిస్తాడని పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయపడుతుండగా...ప్రస్తుత కాలంలో ఏ రాజకీయ పార్టీ కైనా తమదైన వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కనీసం ఒక మీడియా ఛానెల్ అండయినా లేకుండా ఇబ్బందేనని జనసేన శ్రేణులు భావిస్తున్నాయట. ఈ క్రమంలో జె ఛానెల్ రాక కన్ ఫామ్ అంటూ వార్తలు రావడం వారిని ఆనందడోలికల్లో తేలుస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
reports are coming that Pawan Kalyan is all set for the start of JTV. Pawan's takeover of a communist channel, which has turned many hands on the management and management of Alreddy. That Pawan will takeover a Communist channel that faces difficulties in management burden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X