వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నియోజకవర్గానికి రూ.40కోట్లు, బాబుపై నమ్మకం లేదు, జగన్ మాటమార్చారు: పవన్ సంచలనం

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: తాను సినిమాల్లో సరదాగా ఉన్నా.. రాజకీయాల్లో బాధ్యతగా ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్ చెప్పారు. పోరాట యాత్రలో భాగంగా నరసాపురంలో పవన్ ప్రసంగించారు. జిల్లా ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు.

బాబు ద్రోహం చేశారు! జగన్ మాటమార్చారు: ఏపీ నలిగిపోతోందంటూ పవన్ బాబు ద్రోహం చేశారు! జగన్ మాటమార్చారు: ఏపీ నలిగిపోతోందంటూ పవన్

ప్రజలకు మంచి చేయాలనే..

ప్రజలకు మంచి చేయాలనే..

అధికారం ఇస్తే బాధ్యతతో వ్యవహరిస్తానని అన్నారు. సినిమాల్లో తాను వందల కోట్లు సంపాదించవచ్చని.. కానీ, ప్రజలకు ఏదో మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. సీఎం అవ్వాలంటే కష్టమైన పని అని.. ఓపిగ్గా రాజకీయాల్లోకి వచ్చా.నని.. ఎంతో సహనంతో ఉన్నానని.. మీ కోసమే కాదు, మీ బిడ్డల బాగు కోసం కూడా పనిచేస్తానని యువతనుద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.

కన్నీళ్లు తుడవలేదు.. గంగరాజును గెలిపిస్తే..

కన్నీళ్లు తుడవలేదు.. గంగరాజును గెలిపిస్తే..

సీఎం చంద్రబాబు, జగన్, బీజేపీ నేతలు గానీ ప్రజల కన్నీళ్లు తుడవలేదని అన్నారు. బీజేపీ తెచ్చిన స్వచ్ఛ భారత్.. జిల్లాలో పనిచేయలేదని.. 32టన్నుల చెత్త గోదావరిలో పడేస్తున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేస్తారని నరసాపురం ఎంపీ గంగరాజుకు తాను ఎన్నికల సమయంలో మద్దతిస్తే.. ఆ తర్వాత తాను ఫోన్ చేసినా పట్టించుకోలేదని అన్నారు. తనను డబ్బులతో కొనలేరని, ప్రేమతో గెలుచుకోవచ్చని అన్నారు.

మోడీని మళ్లీ కలిసినా..

మోడీని మళ్లీ కలిసినా..

రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేస్తారనే మోడీకి కూడా మద్దతిచ్చానని పవన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిన చంద్రబాబు.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓటేసిందని దుయ్యబట్టారు. కొంత కాలం తర్వాత చంద్రబాబు.. మోడీని కలిసినా ఆశ్చర్యం లేదని అన్నారు. హోదా ఇవ్వని బీజేపీకి ఏపీలో స్థానం లేదని అన్నారు.

బాబు నమ్మకాన్ని కోల్పోయారు..

బాబు నమ్మకాన్ని కోల్పోయారు..


పూటకో మాట మారుస్తూ చంద్రబాబు నమ్మకాన్ని కోల్పోయారని పవన్ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అది జనసేన తీసుకొస్తుందని తెలిపారు. 2019లో తమ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని అన్నారు. తనకు న్యూస్ ఛానళ్లు, పేపర్లు, డబ్బులు కూడా లేవని.. మీరే అన్నీ అని జనసైనికులను, ప్రజలనుద్దేశించి పవన్ అన్నారు.

టీడీపీ నియోజకవర్గానికి 40కోట్లు..

టీడీపీ నియోజకవర్గానికి 40కోట్లు..

తాను ఎప్పుడూ కష్టాలకు దూరంగా వెళ్లలేదని పవన్ అన్నారు. అవినీతి, ఇసుక అమ్మకం ద్వారా టీడీపీ ప్రభుత్వం కోట్లు సంపాదించిందని.. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ.40కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.

జగన్‌లా కాదు.. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే

జగన్‌లా కాదు.. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే

జగన్ లా వేల కోట్లు, మిగితా ఆదాయం వచ్చే మార్గాలు లేవని పవన్ అన్నారు. టీడీపీ, వైసీపీలను ఎదుర్కోవాలంటే మీరు అండగా ఉండాలని ప్రజలను పవన్ కోరారు. తన ఆఖరి శ్వాస వరకు ప్రజలకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు వేరే జీవితం కూడా లేదని అన్నారు.

English summary
Janasena Party president Pawan Kalyan on Friday takes on at Andhra Pradesh CM Chandrababu Naidu and YSRCP president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X