• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అతన్ని ఆంధ్రావాడివి అన్నారు!: పవన్ సంచలన 'విషయం', పార్లమెంటును ముద్దాడిన మోడీ..

|

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశంలో ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని పవర్ ఫుల్ వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆయన పలుమార్లు ఆసక్తికరంగా మాట్లాడారు.

మోడీ నటిస్తే కనుక, కేవలం మంత్రమే: పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్‌కు జేపీ షాక్

ఇక్కడకు వచ్చిన వారికి ఉన్నంత జ్ఞానం, సబ్జెక్ట్ తనకు లేదని, కానీ చలించే హృదయం ఉందని, తప్పు జరుగుతున్నప్పుడు దానిని మూలంలోకి వెళ్లలేను కానీ, దానిని ఎందుకు సరిచేయరని అడగాలని ఉంటుందని, అందరూ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని, కానీ వాస్తవాలు ఎవరూ మాట్లాడం లేదన్నారు.

పవన్‌తో కలిసి పని చేస్తానో లేదో, రాజకీయం అర్థం తెలియదు, నేనే రాజకీయాలు చేస్తున్నా: జేపీ

నాకు తెలిసిన సంఘటన

నాకు తెలిసిన సంఘటన

విభజన అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను శిక్షించారని, దీని పర్యావసనాలు కిందిస్థాయిలో చాలా దారుణంగా ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా తనకు తెలిసిన ఓ సంఘటనను చెప్పారు.

నువ్వు ఆంధ్రావాడివి.. ఇక్కడ పూడ్చొద్దు అన్నారు

నువ్వు ఆంధ్రావాడివి.. ఇక్కడ పూడ్చొద్దు అన్నారు

తనకు ఓ ఫాం హౌస్ ఉందని, తనకు తెలిసిన ఓ కుటుంబం యాభై ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిందని, వారు తన ఫాంహౌస్‌లో పని చేస్తున్నారని, ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయినప్పుడు దానిని ఖననం చేసేందుకు తీసుకు వెళ్తుంటే.. నువ్వు ఆంధ్రావాడివి.. ఇక్కడ పూడ్చడానికి వీల్లేదని హెచ్చరించారని, అప్పుడు వాళ్లకు ఏం చేయాలో తోచలేదని, తనకు తెలిసిన స్నేహితుల ద్వారా వాళ్లకు చెప్పించి అంత్యక్రియలు చేయించానని, ఇలాంటి సమస్య ఉందని, పాలకులు చేసిన తప్పుకు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పవన్ అన్నారు.

రాజకీయంగా ప్రభావం చూపేవాళ్లు బాగానే ఉన్నారు

రాజకీయంగా ప్రభావం చూపేవాళ్లు బాగానే ఉన్నారు

రాజకీయంగా ప్రభావం చూపే వాళ్లు బాగానే ఉన్నారని, కానీ రోజూ పని చేసుకొని బతికే వారు మాత్రం చాలా కష్టాలు పడుతున్నారని, అలాంటి వాళ్లను దగ్గరుండి చూశానని పవన్ చెప్పారు. కొందరి ఆవేదన ఎలా ఉంటుందంటే.. తనకు న్యాయం జరగనప్పుడు ఈ దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడినా అన్న సందేహం కలుగుతుందన్నారు.

ఆ యువత అతివాదం వైపు వెళ్తానన్నారు

ఆ యువత అతివాదం వైపు వెళ్తానన్నారు

ఓసారి అక్వా ఫుడ్ పార్క్ సమస్య కోసం వెళ్లినప్పుడు యువత మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ మాట వినడం లేదని చెప్పారని, మాకు అతివాదం వైపు వెళ్లాలని ఉందని చెప్పారన్నారు.

మోడీ పార్లమెంటును ముద్దాడారు

మోడీ పార్లమెంటును ముద్దాడారు

ప్రధాని నరేంద్ర మోడీ గురించి కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ గెలిచాక తొలిసారి పార్లమెంటు మెట్లను ముద్దు పెట్టుకొని లోపలకు వెళ్లారని, అంటే ఆయన పార్లమెంటు వ్యవస్థను గౌరవిస్తారని అందులో అర్థం ఉందని, కానీ పార్లమెంటులో చేసిన చట్టాలను అమలు చేయనప్పుడు ఏం లాభమని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనప్పుడు చట్టాలను నేను ఎందుకు పాటించాలని ప్రతి ఒక్కరిలో తిరుగుబాటు ధోరణీ వస్తుందని హెచ్చరించారు. ప్రాథమిక సమస్యలను పరిష్కరించకపోవడమే వేర్పాటువాద ఉద్యమాలకు ఊపిరిపోస్తుందన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan takes on Prime Minister Narendra Modi in Joing Fact Finding Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X