వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయపాటీ! తెలంగాణ వారికి కోపం తెప్పించారు, నోరు జారుతారా.. కానివ్వండి: పవన్

విశాఖలో ప్రత్యేక హోదా నిరసనను పోలీసులు అడ్డుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విశాఖలో ప్రత్యేక హోదా నిరసనను పోలీసులు అడ్డుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. అదే సమయంలో 'పందులు పందాలు' అని కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడటంపై స్పందించారు.

బాబుకు రాజమౌళి షాక్: మహేష్ బాబు ద్రోహి..'రియల్' హీరో పవన్ వెంట నడువు: వర్మబాబుకు రాజమౌళి షాక్: మహేష్ బాబు ద్రోహి..'రియల్' హీరో పవన్ వెంట నడువు: వర్మ

ప్యాకేజీ ముసుగు తొడిగి..

విభజనకు ముందు పంచభక్ష పరమాన్నాలతో కూడిన హోదా ఇస్తామని చెప్పి, ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక అన్ని రాష్ట్రాల వలె సాధారణ నిధులను ఇస్తూ దానికి ప్రత్యేక ప్యాకేజీ అని ముసుగు తొడిగి రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెడతారా అని నిలదీశారు.

Pawan Kalyan takes on Sujana and Rayapati

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం హోదాను తాకట్టు పెట్టవద్దని, ఎంపీ రాయపాటి ఓసారి ఆలోచించాలని పవన్ ట్వీట్ చేసారు. ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారని తెలంగాణలో అపవాదు తెచ్చారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా డబ్బు, దురాశ, పదవీ వ్యామోహంతో ఏపీ భావి తరాల భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు.

రాయపాటి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయరని, చేసే వారిని చెయ్యనివ్వరని, పైగా కష్టపడే రైతుల పచ్చని పొలాల్లో పోలవరం కాంట్రాక్టు లాభాల కోసం మట్టిని డంప్ చేయిస్తారని ఎద్దేవా చేశారు.

సుజనా చౌదరిపై..

యువత పోరాట స్ఫూర్తిని సుజనా చౌదరి 'పందులు పందాలు'తో పోల్చడం బాధాకరమని పవన్ ట్వీట్ చేశారు. ఇక మీరు నోరు జారే కొద్ది యువతను రెచ్చగొట్టడమే.. సరే అలాగే కానివ్వండని ట్వీట్ చేశారు.

లడ్డూలపై వివరణ

పవన్ విడుదల చేసిన జనసేన దేశ్ బచావో ఆల్బమ్‌లో లడ్డూల పాట వివాదాస్పదమయింది. దీనిపై పవన్ స్పందించారు. పవన్ ప్రతి సందర్భంలో పాచిపోయిన లడ్డూలు అని వ్యాఖ్యానించారు. ఇది తమను అవమానించేలా ఉందని కొందరు పవన్ పైన ఆగ్రహించారు.

పోలీసుల ఎఫెక్ట్: రూటుమార్చిన పవన్ కళ్యాణ్ 'ఫ్యాన్', వేదిక మారింది!పోలీసుల ఎఫెక్ట్: రూటుమార్చిన పవన్ కళ్యాణ్ 'ఫ్యాన్', వేదిక మారింది!

దీనిపై పవన్ వివరణ ఇచ్చారు. తనకు లడ్డూల మీద కానీ, అవి అమ్మే వ్యాపారుల మీద కాని, వాటిని తినే వారి మీద కాని ఎలాంటి చులకన భావం లేదని, కానీ అడక్కుండా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టే వారి మీదే తనకు ఉన్న అసహనం అని చెప్పారు. లడ్డూ తినడం ఆరోగ్యానికి హానికరం కాదని పవన్ ట్వీట్ చేయడం గమనార్హం.

English summary
Jana Sena chief Pawan Kalyan lashed out at TDP leaders Sujana Choudhary and Rayapati Sambasiva Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X