
Pawan kalyan : పవన్ కేనా రూల్స్ ! ఆలివ్ గ్రీన్ కార్లు,బైక్ ల పోస్టులతో- కారు నుంచి కట్ డ్రాయర్..
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తయారు చేయించుకున్న ఆలివ్ గ్రీన్ రంగు వాహనం వారాహిపై వైసీపీ విమర్శలకు దిగింది. నిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని అయితే అసలు మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్ గ్రీన్ రంగు మీరెలా వాడతారంటూ పవన్ ను ప్రశ్నించారు. దీనిపై ఇవాళ ఉదయం వరుస ట్వీట్లు పెట్టి కౌంటర్ ఇచ్చిన పవన్.. సాయంత్రం మరో రౌండ్ ట్వీట్లు పెట్టారు. ఇందులో మరిన్ని అంశాల్ని ప్రస్తావించారు. అంతిమంగా పవన్ కేనా రూల్స్ అంటూ వైసీపీకి సూటి ప్రశ్న వేశారు.

వారాహి ఆలివ్ గ్రీన్ రంగు వివాదం
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు తయారు చేయించుకున్న వాహనం వారాహి ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉండటంతో వైసీపీ నేతలు విమర్శలకు దిగారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా వారికి అంతే ఘాటుగా జవాబు ఇస్తున్నారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు పెడుతూ వైసీపీ నేతల దుమ్ము దులిపేస్తున్నారు. తనపై విమర్శలు చేసిన పేర్నినాని సహా వైసీపీ నేతలెవరి పేర్లు ఎత్తకుండానే ట్విట్టర్ లో తన వాదన వినిపిస్తున్నారు. ఇందులో పలు ఫొటోలు కూడా షేర్ చేస్తున్నారు. దీంతో పాటు వాటికి ట్యాగ్ లైన్లు కూడా పెట్టేస్తున్నారు. దీంతో పవన్ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
మీకు ఏ కలర్ అయితే ఓకే ?
జనసేనాని పవన్ కళ్యాణ వైసీపీ నేతల్ని ఉద్దేశించి సాయంత్రం పెట్టిన ఓ ట్వీట్లో ఓ పార్కు ఫొటో పెట్టారు. ఇందులో పలు రకాల మొక్కలున్నాయి. అలాగే అవి గ్రీన్ లోనే పలు వేరియంట్లతో ఉన్నాయి. ఇందులో ఏ కలర్ అయితే మీకు ఓకే అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. ఆలివ్ గ్రీన్ కలర్ ను వాడకూడదంటూ వైసీపీ నేతలు వార్నింగ్స్ ఇస్తున్న నేపథ్యంలో ఇందులో ఏ కలర్ వాడమంటారంటూ పవన్ ప్రశ్నించారు.
పవన్ కేనా రూల్స్ అంటూ ఫొటోలతో ప్రశ్న
మరో ట్విట్టర్ పోస్టులో పవన్ కళ్యాణ్ ఆలివ్ గ్రీన్ రంగుతో కూడిన కారు, బైక్ ల ఫొటోల్ని షేర్ చేశారు. అలాగే తాను తయారు చేయించుకున్న వారాహి వాహనం ఫొటో కూడా పెట్టారు. ఈ మూడు ఫొటోలను పోలుస్తూ వైసీపీకి ఓ ప్రశ్న వేశారు. పవన్ కేనా రూల్స్ అంటూ జనసేనాని ప్రశ్నించారు. అంటే అదే ఆలివ్ గ్రీన్ కలర్ వాడుతున్న మిగతా వారికి మీరు చెబుతున్న రూల్స్ వర్తించవా అనే అర్దం వచ్చేలా పవన్ ఈ ఫొటోలు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీకి అసూయ అంటూ ట్వీట్స్
మరో ట్వీట్ లో పవన్ కళ్యాణ్ తనపై వైసీపీ అసూయ ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఇందులో ఓ ఉదాహరణను కూడా జత చేసి మరీ పవన్ పోస్టు చేశారు. ఈ ఉదాహరణలో తన క్లాస్ టీచర్ గతంలో అసూయ గురించి ఓ విషయం చెప్పిందన్నారు. విద్యార్థులు ఈర్ష్యగా భావించినప్పుడు, ఇతర పిల్లలతో పోల్చి దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడు ఈ కోట్ తరచుగా తన క్లాస్ టీచర్ ఓ విషయం చెప్పేవారని పవన్ గుర్తుచేశారు. 14:30; "శాంతితో ఉన్న హృదయం శరీరానికి జీవాన్ని ఇస్తుంది, కానీ అసూయ ఎముకలను కుళ్ళిస్తుంది." అంటూ బైబిల్ లో ఓ కోట్ దీనికి జత చేశారు. అలాగే మరో ట్వీట్లో అసూయతో వైసీపీ ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయని పవన్ చెప్పుకొచ్చారు.
కారు నుంచి కట్డ్రాయర్ వరకూ..
మరో
ట్వీట్లో
వైసీపీ
ప్రభుత్వ
పాలనలో
చోటు
చేసుకుంటున్న
పరిణామాల్ని
పవన్
గుర్తుచేశారు.
వైసీపీ
టిక్కెట్
రేట్లు,
కారు
రంగులు,
కూల్చడాలు
లాంటి
చిల్లర
పనులు
ఆపి
ఏపీ
అభివృద్ధి
మీద
దృష్టి
పెట్టాలన్నారు.
ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వాటాలు వేధింపుల వలన " కారు నుంచి కట్డ్రాయర్ కంపెనీల " దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్..అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తద్వారా ఏపీలో వైసీపీ చేస్తున్న రాజకీయాల కారణంగా పెట్టుబడులు పెట్టాల్సిన సంస్ధలు తరలిపోతున్నాయని పవన్ విమర్శించారు.