వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను సీఎం అనండి: అడిగి పిలిపించుకున్న పవన్, కారులోనే.. ఎందుకు నడవలేదంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

నన్ను సీఎం అనండి అని అడిగి పిలిపించుకున్న పవన్

ధవళేశ్వరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలను సీఎం.. సీఎం అనండని పవన్ కళ్యాణ్ కోరి మరీ పిలిపించుకున్నారు. దానికి కారణం ఉంది. ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పే ఉద్దేశ్యంతో చెప్పారు. సీఎం.. సీఎం అంటుంటారు కదా.. ఓసారి నాకోసం అనండని జనసేనాని చెప్పారు.

చదవండి: కవాతులో కారులోనే పవన్ డ్యాన్స్ చేస్తూ ఉత్సాహం: తొక్కిసలాట డౌట్, భారీగా పోలీసులు

చంద్రబాబు అదే చేస్తారు

చంద్రబాబు అదే చేస్తారు

అందరూ సీఎం.. సీఎం అని నినాదాలు చేశారు. ఆ తర్వాత పవన్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కావడం అంత తేలిక కాదని, అరిస్తే కాలేమని, ఓటు రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. 2009లో వైయస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారో, రాబోయే రోజుల్లో చంద్రబాబు కూడా అదే చేస్తారని, ప్రతి నియోజకవర్గంలో లక్షల ఓట్లు తీసేశారని, దాదాపు 21 లక్షల ఓట్లు తీసేశారని, దీనిలో 19 లక్షల చిల్లర ఓట్లు జనసేనవి అన్నారు.

యుద్ధం ఒక్కడిని చేయాల్సింది కాదు

యుద్ధం ఒక్కడిని చేయాల్సింది కాదు

18 ఏళ్లు నిండిన వారు ఓటు రిజిస్టర్ చేయించుకోండని, జనవరి 1తో 18 ఏళ్లు నిండేవారికి కూడా అక్టోబర్ 31 వరకు అవకాశం ఉందని, ప్రేమతో ఓపిక చేసుకుని ఈసేవ సెంటర్లకు వెళ్లాలని, ఆడపిల్లలను తీసుకువెళ్లండని, మార్పు రావాలంటే యుద్ధం నేను ఒక్కడిని చేయాల్సింది కాదని, మనం అందరం కలిపి చేసేదని చెప్పారు.

మా అన్నయ్యకు తెలియదు

మా అన్నయ్యకు తెలియదు

తాను ఏమీ ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే తనను బూతులు తిట్టించారని, తనను నిరుత్సాహపరిచి భయపెట్టాలనని చూశారని పవన్ అన్నారు. రాజమండ్రి నుంచి చెబుతున్నానని, పద్నాలుగేళ్ల వయస్సులో దేశానికి సేవ చేయడానికి నిర్ణయించుకున్నానని, మా అన్నయ్యకు తెలియదని, అమ్మ, నాన్నకే తెలుసునని చెప్పారు. రాజకీయాలను అర్థంచేసుకొని వచ్చానన్నారు.

కవాతులో పవన్ కళ్యాణ్ ఎందుకు నడవలేదంటే

కవాతులో పవన్ కళ్యాణ్ ఎందుకు నడవలేదంటే

కాగా, సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజీ ఎక్కారు. వేదిక వద్దకు చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టింది. విజ్జేశ్వరం వద్ద కాన్వాయ్ మొదలైంది. ఆ వెంటనే పారా గ్లైడర్లతో స్వాగతం పలికారు. కవాతుకు చేద్దామంటే వాహనశ్రేణి దిగి అడుగు పెట్టేందుకు అవకాశం దొరకలేదు. పైగా తొక్కిసలాట జరిగే సూచనలు ఉండటంతో పోలీసులు సూచన చేశారు. దీంతో పవన్ కారులోనే కవాతులో పాల్గొన్నారు. అయితే పవన్ కవాతులో నడవలేదని, కవాతు అంటే నడక అని విమర్శలు వస్తున్నాయి. కానీ తొక్కిసలాట జరుగుతుందనే అనుమానంతో కారులో వెళ్లారు.

English summary
Jana Sena chief Pawan Kalyan talks about Chiranjeevi and Chief Minister post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X