India
 • search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల గుండు కొట్టించలేదు, నేనే, ఊరుకునేవాడినా: పవన్, వంగవీటి రంగా హత్య, కులపిచ్చిపైనా..

|
Google Oneindia TeluguNews
  Pawan Kalyan Tour : Pawan Kalyan About His Clash With Paritala Ravi

  అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం గుంటూరు, కృష్ణా జిల్లాల అభిమానులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరిటాల రవీంద్ర తనకు గుండు కొట్టించడం, వంగవీటి రంగా హత్య, ఏపీలో ముఖ్యంగా విజయవాడలో కుల రాజకీయాలు తదితర అంశాలపై మాట్లాడారు.

  ఆ రాజకీయాలు నేనూ చేయగలను కానీ: బాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక, నిన్న అలా, నేడు ఇలాఆ రాజకీయాలు నేనూ చేయగలను కానీ: బాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక, నిన్న అలా, నేడు ఇలా

  రాష్ట్రంలో నిర్మాణాత్మకంగా రాజకీయాలు చేస్తున్నానని, కొట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ప్రజలు ఆనందంగా లేనప్పుడు ఎంతపెద్ద రాజధాని కట్టినా ఫలితం ఉండదని చెప్పారు. పార్టీ కార్యాలయం పెడుతున్నానని, అన్ని సమస్యలపై పోరాడుతానని స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడు అనే చంద్రబాబుకు మద్దతు పలికానని చెప్పారు. తన గురించి చెడుగా మాట్లాడే వారిని మనసులో పెట్టుకోలేదన్నారు.

  వారసత్వంపై పవన్ కళ్యాణ్‌కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ ఆస్తుల ప్రకటనపై సెటైర్వారసత్వంపై పవన్ కళ్యాణ్‌కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ ఆస్తుల ప్రకటనపై సెటైర్

   పరిటాల రవి గుండు కొట్టించలేదు

  పరిటాల రవి గుండు కొట్టించలేదు

  తనకు పరిటాల రవి గుండు గీయించారని, కొట్టారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని, అది పేపర్లో వేసే స్థాయికి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలా ప్రచారం చేసింది ఎవరో కూడా తనకు తెలుసునని, టీడీపీలో కొందరు అలా చేశారని చెప్పారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసి ఉండకపోవచ్చునని చెప్పారు. టీడీపీ వాళ్లు అప్పుడు తనకు చాలా ద్రోహం చేశారన్నారు. ఆ ప్రచారం జరిగినప్పుడు పరిటాల రవి తనకు తెలియదన్నారు.

   నాకు అలాంటి అవమానం జరిగితే ఊరుకునే వాడినా

  నాకు అలాంటి అవమానం జరిగితే ఊరుకునే వాడినా

  నాకు అలా అవమానం (గుండు కొట్టిస్తే) నేను ఊరుకునే వాడినా అని పవన్ అన్నారు. కానీ తాను అలాంటి వాటిని ఎప్పుడూ మనసులో పెట్టుకోలేదని చెప్పారు. అందుకే 2014లో టీడీపీకి మద్దతు పలికానని చెప్పారు. తనకు సినిమాలపై చిరాకు పుట్టి అప్పుడు గుండు గీయించుకున్నానని చెప్పారు.నేను తమ్ముడు షూటింగ్ సినిమాలో ఉన్నప్పుడు చిన్నన్నయ్య నాకు ఫోన్ చేసి పరిటాల రవి నిన్ను తీసుకెళ్లారా అని అడిగారని, ఆ ప్రశ్నతో తనకు ఏమీ అర్థం కాలేదని, అసలు పరిటాల రవి ఎవరు అని అడిగానని చెప్పారు.

   అభిమానులకు ఏమైనా జరిగితే తట్టుకోలేను

  అభిమానులకు ఏమైనా జరిగితే తట్టుకోలేను

  తన అభిమానులకు ఏదైనా జరిగితే తాను తట్టుకోలేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ అరుపులు, కేకలతో మార్పు రాలేదని, ఆలోచనలతో మార్పు వస్తుందని చెప్పారు.

  వంగవీటి రంగా తప్పు చేస్తే శిక్షించాల్సింది

  వంగవీటి రంగా తప్పు చేస్తే శిక్షించాల్సింది

  విజయవాడ కుల రాజకీయాల గురించి తనకు తెలుసునని చెప్పారు. నాడు వంగవీటి రంగా ఏదైనా తప్పు చేసి ఉంటే శిక్షించాల్సి ఉండెనని, కానీ నిరాయుధుడుగా ఉన్న ఆయనను చంపడం పెద్ద తప్పు అన్నారు. వంగవీటి రంగా హత్య లేకుండా విజయవాడ రాజకీయాల గురించి మాట్లాడలేమన్నారు. రంగా హత్య తర్వాత విధ్వంసమూ తప్పే అన్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు నలిగిపోయాయన్నారు. ఓ మహిళ భవనంపై నుంచి దూకి కాళ్లు పోగొట్టుకుందన్నారు. కమ్మవాళ్ల ఆస్తులపై దాడులు కూడా జరిగాయన్నారు.

   ప్రజల పక్షాన పోరాడుతా

  ప్రజల పక్షాన పోరాడుతా

  అర్థం లేని ఆవేశం అనర్థానికి దారి తీస్తుందని చెప్పారు. అభిమానులు అరిస్తే నేను సీఎంను కానని, తనకు పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల పక్షాన పోరాడుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అభివృద్ధి ఒకవైపు పరిమితం కాకూడదని, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు అందాలని చెప్పారు.

   జగన్‌పై కేసులు ఉన్నాయనే సమర్థించలేదు

  జగన్‌పై కేసులు ఉన్నాయనే సమర్థించలేదు

  వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై ఎన్నో కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని తాను ఎలా సమర్థిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతోనే తాను 2014లో టీడీపీకి మద్దతు పలికానని చెప్పారు. అభివృద్ధి పారదర్శకంగా జరగాలని చెప్పానని తెలిపారు.

  ఈ కుల గొడవలు ఉండవద్దు

  ఈ కుల గొడవలు ఉండవద్దు

  కులాల మధ్య ఐక్యత ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు హిందువులు ఒకలా, ముస్లీంలు ఒకలా, క్రిస్టియన్లు మరొకలా కాదని చెప్పారు. తనకు అందరూ సమానమేనని చెప్పారు. కాపులకు బీసీలకు గొడవ, కాపులకు కమ్మలకు గొడవ ఇలా ఎన్నో ఉంటాయన్నారు. ఇవన్నీ ఉండకూడదన్నారు.

  ఏపీ బాగుపడాలంటే కులపిచ్చి వద్దు, తెలంగాణలో లేదు

  ఏపీ బాగుపడాలంటే కులపిచ్చి వద్దు, తెలంగాణలో లేదు

  ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మొదట కులపిచ్చి నుంచి బయటపడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో ఇంత కుల వ్యవస్థ లేదన్నారు. అయినా డబ్బుంటేనే కులమని, పేదవాడు అయితే మళ్లీ ఎవరూ పట్టించుకోరని చెప్పారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ అన్న, అక్క చెల్లే అనుకునేలా ఉండాలన్నారు. అందరూ కలిసి కట్టుగా ఉంటే అబివృద్ధి సాధ్యమని చెప్పారు.

   కులపిచ్చి వదిలేస్తేనే ప్రపంచస్థాయి రాజధాని

  కులపిచ్చి వదిలేస్తేనే ప్రపంచస్థాయి రాజధాని

  కులం పరిధిని దాటితేనే అమరావతి, విజయవాడ ప్రపంచస్థాయి రాజధాని అవుతుందని చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా అందరూ కలిస్తేనే మనం ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించుకోగలమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనకు ప్రపంచస్థాయి రాజధాని పరిస్థితి లేదన్నారు. ఆ స్థాయికి ఎదగాలన్నారు.

  English summary
  Jana Sena chief Pawan Kalyan talks about Paritala Ravi and Vangaveeti Ranga murders.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X