వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్‌ను జనసేనాని వదలట్లేదుగా ... వీడియో మెసేజ్‌లతో హితబోధ చేస్తున్నారుగా !!

|
Google Oneindia TeluguNews

ఏపీలో తెలుగుమీడియం తీసివేత రగడ ఆగటం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి ని వదలటం లేదు . ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగున్నా, పూర్తిగా తెలుగు మీడియం తీసివెయ్యాలన్న ఆలోచనతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక దీనిపై నెలకొన్న రాజకీయ దుమారం ఒకరిపై ఒకరు వింర్షలు చేసుకునే దాకా వెళ్తుంది . తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్ తెలుగు మీడియం తీసివేత నిర్ణయం మంచిది కాదని వీడియో మెసేజ్ లు పోస్ట్ చేసి మరీ అర్ధం అయ్యేలా చెప్పారు.

ట్విట్టర్ వేదికగా మరోమారు విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం మాట అటుంచి తెలుగు మీడియంను తీసివేయాలనే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆయన మరోమారు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారుపవన్ వాదనను సీఎం జగన్ తో పాటు, వైసీపీ నేతలు పలువురు తిప్పి కొడుతున్నా పవన్ మాత్రం జగన్ ను వదలటం లేదు . తనపైనా..తన వాదనపైనా విమర్శలు చేస్తున్న ఏపీ అధికారపక్షంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.

ఏ విషయమైనా తెలుగులో చెప్తేనే సులువుగా అర్ధం అవుతుందన్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత తాజాగా సీఎం జగన్ కు ట్వీట్ రూపంలో పంపిన వీడియో మెసేజ్ లో సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్ బోధనపై మన నుడి.. మన నది పేరుతో పవన్ స్టార్ట్ చేసిన ఉద్యమంలో భాగంగా తాజాగా ఆయన ట్వీట్ల వర్షం కురిపించారు. ఏ విషయమైనా తెలుగులో చెప్పినప్పుడు మాత్రమే సులువుగా అర్థమవుతుందన్న ఆయన ట్వీట్లతో పాటు వీడియోలను పోస్టు చేశారు.భాష గొప్పతనం చెప్పే ప్రయత్నం చేశారు. సంస్కృత శ్లోకాలను, స్తోత్రాలను ఇంగ్లీషులో చెబితే అర్థమవుతుందా? అని ప్రశ్నించారు.

సంస్కృత శ్లోకాలకు సంబంధించిన పలు వీడియోలు పోస్ట్ చేసిన పీకే

ఇక తెలుగు భాషకు మూలం దేవభాషగా పిలిచే సంస్కృతమని, ద్వాపర యుగంలో లిఖితమైన భగవద్గీత కానీ, శంకరాచార్య విరచితం శివాష్టకం కానీ భక్తితో పాటు సంస్కృత భాష గొప్పతనాన్ని తెలియజేస్తాయన్నారు. మనో వికాసానికైనా, మత ప్రచారానికైనా మనకు తెలిసిన భాషలో చెప్పినప్పుడే సామాన్యులకు సులువుగా అర్థమవుతుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తాను పోస్టు చేసిన వీడియోల్లోని స్తోత్రాలను ఇంగ్లీషులో చెబితే సామాన్యులకు అర్థమవుతాయా? అంటూ ప్రశ్నించిన భారతీయ భాషల గొప్పతనం ఇదే అని చెప్పారు. తెలుగు గొప్పతనం తెలుసుకోమని సూచించారు.

జగన్ కు తెలుగుపై హిత బోధ చేస్తున్న పవన్ ... రివర్స్ ఎటాక్ చేస్తున్న వైసీపీ

జగన్ కు తెలుగుపై హిత బోధ చేస్తున్న పవన్ ... రివర్స్ ఎటాక్ చేస్తున్న వైసీపీ

ఇక ఇటీవల ఆయన జగన్ రెడ్డి గారు 'మా తెలుగు తల్లికి' అంటూ పాడాల్సిన మీరు తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు మీడియాను నడుపుతూ, తెలుగును చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సూచిస్తోందంటూ సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. మాతృ భాషను మృత భాషగా మార్చకండని ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఇక పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తున్న వైసీపీ ఇంతకీ పవన్ పిల్లలు చదివేది ఏ మీడియంలోనో చెప్పాలని ఎదురు దాడికి దిగుతున్నారు. అయినా సరే పవన్ మాత్రం సీఎం జగన్ కు తెలుగు భాష గొప్పతనం చెప్తూ హితబోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Janasena chief Pawan Kalyan once again criticized Jagan. As a Twitter platform, he expressed outrage over the decision to removal of Telugu medium education. Pawan posted video messages to tell about the greatness of language. he posted sanskrit shlokas and said that the sanskrit shlokas not possible to say in english. this is the great ness of deva lipi he said . he tried to tell about Telugu it is not a dead language it's a wonderful language we can expalian any situation easily in our mother tongue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X