వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 లక్షల మందితో కవాతు, ప్రత్యేక డ్రెస్, టీజర్ అదిరింది: వారిద్దరికీ పవన్ కళ్యాణ్ థ్యాంక్స్

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్ ఈ నెల 15వ తేదీ (సోమవారం) నుంచి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రేపు జనసేన కవాతు నిర్వహిస్తోంది. మధ్యాహ్నం రెండు గంటలకు కాటన్‌ బ్యారేజీపై దీనిని నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు.

చదవండి: ఎదురుపడిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్: 'నేను చిరంజీవిని కాదని వస్తే, మీరేం చేశారు!'

వంతెనపై నడుస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గోదావరి నదిలోను భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 15వ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు బ్యారేజీ దిగువన ఉన్న కాటన్‌ విగ్రహం సమీపంలో బహిరంగ సభ ఉంటుంది. బ్యారేజీపై కవాతుకు దాదాపు 2 లక్షల మందికి పైగా హాజరవనున్నారు.

పాదయాత్రలా జనసేన కవాతు

జనసేన కవాతు పాదయాత్రలా సాగనుంది. ఇందులో పాల్గొనే 10వేల మందిలో ప్రత్యేక డ్రెస్‌లో పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారు. మిగిలిన వారు వారిని అనుసరిస్తారు. పిచ్చుకలంక నుంచి ప్రారంభమయ్యే కవాతు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలం వరకు సాగుతుంది. కవాతులో వివిధ కులవృత్తుల వారు పాల్గొంటారు. కవాతు నిర్వహణ, బహిరంగ సభ కోసం 1500 మందికి శిక్షణ ఇచ్చారు. కవాతుకు పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలతో పాటు పలు జిల్లాల నుంచి రానున్నారు. ధవళేశ్వరం, పార్కింగ్ సదుపాయం కల్పించారు. కాగా, టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

వారికి థ్యాంక్స్

జనసేన పార్టీ కవాతు పాటకు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పద పద పద పద మెరుపులా పద.. ఆ గగనం భువనం అదిరే మెరుపులా పద.. అని సాగే ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ఈ పాటను విడుదల చేయనున్నట్లు శనివారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఈ మేరకు పాట రికార్డింగ్ రూంలో తీసిన వీడియోను షేర్ చేశారు.

తమన్‌కు థ్యాంక్స్

డియర్ తమన్ అని పేర్కొంటూ, జనసేన మోటివేషనల్ సాంగ్ కోసం సమయం కేటాయించిన సోదరుడు తమన్‌కు థ్యాంక్స్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. మీ వర్క్ స్ఫూర్తినిచ్చేదిగా, మోటివేటింగ్‌గా, జనసేనికులను ఉత్సాహపరిచే విధంగా ఉందని పవన్ పేర్కొన్నారు. మీకు సెల్యూట్ చేస్తున్నానని, జై హింద్ అని పేర్కొన్నారు.

ప్రియమైన రామజోగయ్య గారికి ధన్యవాదాలు

ప్రియమైన రామజోగయ్య గారికి, విపరీతమైన పని ఒత్తిడిలో ఉండి కూడా నా కోరికను మన్నించినందుకు మీకు నా కృతజ్ఞతలు అని పవన్ ట్వీట్ చేశారు. మీరు మీ విలువైన సమయాన్ని జనసేన కవాతు పాటకు, యువతని ఆలోచింప చేసే పదాలు, భావితరాల భవిష్యత్తు కోసం పిరికితనం వదిలి మనం మనోధైర్యంతో నడుం బిగించి ముందుకు నడవాలని అన్న మీ ఆలోచన స్ఫూర్తి చాలా ప్రస్పుటంగా పాట రచనలో కనిపించిందన్నారు. మీకు మనస్ఫూర్తిగా జనసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan thanks to Ramajogaiah Sastry and Thaman for Janasena Kavathu song.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X