వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ టివి ఛానెల్!...పేరు జె టివి?...నిజమేనా?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Plans To Start A New TV Channel ?

పవన్ కళ్యాణ్ ఛానెల్ పెడుతున్నారనే వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్...కారణం సింపుల్...మీడియాపైనే యుద్దం ప్రకటించిన పవన్ మరి తానే మీడియా ఓనర్ గా మారుతున్నారంటే వెరీ ఇంట్రెస్టింగే కదా!...

ఇంతకీ ఇది నిజమేనా?...అంటే ఇప్పటికిప్పుడు ఎవ్వరూ నిర్థారించలేకపోయినా...ప్రస్తుతం పవన్ ఉన్న పరిస్థితులను బట్టి ఈ వార్త నిజమేనేమోనని అందరూ భావిస్తున్నారు. అసలు ఈ ప్రచారం ఎలా మొదలైందంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జె టివి అనే లోగో...క్యాప్షన్...ఇంత పక్కాగా డిజైన్ చేశారంటే ఖచ్చితంగా పవన్ ఛానెల్ పెడుతూ ఉండవచ్చనేది అత్యధికుల భావన. అయితే కొంతకాలం కిందటే ఈ తరహా ప్రచారం జరిగి కార్యరూపం దాల్చకపోయినా ప్రస్తుత పరిస్థితులను బట్ట పవన్ ఛానెల్ పెట్టి తీరుతాడనే ఎక్కువమంది నమ్ముతున్నారు.

పవన్...ఛానెల్ పెడుతున్నారా?...

పవన్...ఛానెల్ పెడుతున్నారా?...

ఈ ప్రశ్నకు సమాధానం కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. అయితే కొంతకాలం క్రితమే పవన్ కళ్యాణ్ టివి ఛానల్ పెట్టబోతున్నట్లు వార్తలు రావడంతో నిప్పులేందే పొగ రాదు అన్నట్లుగా పవన్ కి టివి ఛానెల్ పెట్టే ఆలోచన ఉండే ఉండొచ్చని చాలా మంది భావించారు. పైగా సినీ హీరో గా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఆయనకు టివి ఛానెల్ ఉంటే తనకంటూ అడ్వాంటేజ్ వుంటుంది కాబట్టి ఆ ఆలోచన చేసి ఉండొచ్చని అనుకున్నారు. పైగా మీడియా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా కూడా చేసి ఉండటంతో ఆయనకు మీడియా ప్రాధాన్యత అర్థమై ఛానెల్ పెట్టాలని అనుకోని ఉండొచ్చని మీడియా వర్గాలే విశ్లేషించాయి.

ఇప్పుడైతే...ఖచ్చితంగా పెడతారని...

ఇప్పుడైతే...ఖచ్చితంగా పెడతారని...

అయితే గతంలో పవన్ ఛానెల్ పెట్టే విషయమై వార్తలు వచ్చినా అప్పుడు కేవలం సినీ, రాజకీయ అవసరాల కారణంగా కాబట్టి తానే ఛానెల్ పెట్టే విషయమై తర్జనభర్జన పడుతూ ఉండొచ్చని...అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కొన్ని టివి ఛానెళ్ల కారణంగా తాను వ్యక్తిగతంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్వయంగా పవనే వెల్లడించడం గమనార్హం. అంతేకాకుండా శుక్రవారం పవన్ కు సంబంధించి జరిగిన పరిణామాలు రాజకీయాల కంటే ప్రధానంగా టీవీ ఛానెళ్లతోనే ముడిపడి ఉండటం...ఆ నేపథ్యంలోనే ఈ టివి ఛానెల్ పెట్టే విషయం ప్రచారంలోకి రానుండటంతో పవన్ ఇక ఖచ్చితంగా ఛానెల్ పెట్టితీరుతారనే అభిప్రాయానికి బలం చేకూరుతోంది.

ఛానెల్ పేరు...లోగో...ఇదేనట

ఛానెల్ పేరు...లోగో...ఇదేనట

ప్రస్తుత్తం పవన్ పెడతున్న ఛానెల్...లేదా పవన్ అండదండలతో స్థాపితం కాబోతున్న ఛానెల్ ఇదే నంటూ ఓ లోగో క్యాప్షన్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి. ఆ ఛానెల్ పేరు ఆంగ్లాక్షరాలతో రూపొందించిన "జె టివి" గా చెబుతున్నారు. ఒక వ్యక్తి పిడికిలి బిగించిన చేయిని జె ఆకారంలో ఎరుపు రంగులో డిజైన్ చేయగా ఆ పక్కనే టివి అనే ఇంగ్లీష్ అక్షరాలను జత చేశారు. పైన జనం కోసం అనే క్యాప్షన్ ఉండగా కింద మీ కోసం...మీ తోడుగా అనే ట్యాగ్ లైన్లను పొందుపరిచారు. వీటన్నింటికి వెనక జనసమూహాన్ని బూడిద రంగులో బ్యాక్ గ్రౌండ్ గా చేర్చారు.

అయితే...సారధ్యం ఎవరు?

అయితే...సారధ్యం ఎవరు?

గతంలో ఓ ఛానెల్ ను భారీగానే ప్రారంభించి ఆ తరువాత సరైన నిర్వహణ లేక చతికిలబడిన ఒక ఛానెల్ ఎక్విప్ మెంట్, లైసెన్స్ లతో నిరుపయోగంగా పడి వుండటంతో వాటన్నింటిననీ వాడుకుని వీలైనంత త్వరగా ఈ "జె ఛానెల్" ప్రారంభించాలని పవన్ ఆలోచిస్తున్నారని సమాచారం. అదే ఛానెల్ కోసం మీడియాలో బాగా అనుభవం వున్న కొందరు జర్నలిస్టులను తీసుకున్నారని, వారిలో కొందరిని...అలాగే పవన్ తన రాజకీయావసరాల కోసం చాలా మంది మీడియా వాళ్లతో టచ్ లో ఉన్నందున సిబ్బంది కొరత అనే ప్రశ్నే ఉత్పన్నమవదని అంటున్నారు.

ఎప్పుడు రావచ్చు...ఎలా ఉండొచ్చు

ఎప్పుడు రావచ్చు...ఎలా ఉండొచ్చు

పవన్ ఛానెల్ పెట్టే విషయం ఇప్పటికిప్పుడు ప్రధాన అంశంగా భావించి ముందుకు వెళ్లాలా? లేక తాను ఇప్పుడు తలపెట్టిన పోరాటమే ప్రధానంగా ముందు కెళ్లాలా? లేక రెండింటికీ ప్రాధాన్యత ఇవ్వాలా అనేది రెండు రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దాన్ని బట్టి పవన్ ఇప్పుడు ఛానెల్ ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే మూడు నెలల లోపే ఆ ఛానల్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. అయితే కాస్త ఆలస్యమైనా ఓవరాల్ గా మాత్రం పవన్ కు సపోర్ట్ గా...పవన్ అవసరాలే ప్రధానంగా ఒక ఛానెల్ అయితే రావడం ఖాయమంటున్నారు. ఇక ఆ ఛానల్ పవన్ పెట్టే ఆ ఛానల్ మీద "కెమెరామన్ గంగతో రాంబాబు" సినిమా ప్రభావం తప్పకుండా ఉంటుందని...ఆ తరహాలోనే ఛానెల్ దూకుడు ఉండటం ఖాయమని పవన్ నైజం తెలిసిన వాళ్లు స్పష్టం చేస్తున్నారు.

English summary
Janasena chief Pawan Kalyan is planning to start a tv channel. There is a campaign going on social media. The name of that channel is JTV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X