వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ పరిస్థితిల్లో వద్దనే: మునికోటి మృతిపై పవన్ కళ్యాణ్, ఆ ముగ్గుర్ని ఏకేసిన శివాజీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న మునికోటి అంశంపై జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ట్వీట్ చేశారు.

ప్రత్యేక హోదా పైన విపక్షాలు నిత్యం పవన్ కళ్యాణ్‌ను నిలదీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు.

మునికోటి చనిపోవడం నాకు చాలా బాధ అనిపించిందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.

ఈ సమయంలో ప్రత్యేక హోదా విషయమై తాను స్పందించక పోవడం పైన కూడా వివరణ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి నాకు నేను మాట్లాడకుండా గట్టిగా నియంత్రించుకుంటున్నానని చెప్పారు.

కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకం ఇప్పటికీ టిడిపికి, పవన్ కళ్యాణ్‌కు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇవ్వకుంటే తాను నిలదీస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారని అర్థమవుతోందని చెబుతున్నారు.

మోడీ, చంద్రబాబు, జగన్‌లను ఏకేసిన శివాజీ

ప్రధాని నరేంద్ర మోడీ పైన నటుడు శివాజీ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకంటే, విభజనకు సహకరించి, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీనే సీమాంధ్రులకు ఎక్కువ అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.

ఏపీకి అన్ని విధాలా సహకరిస్తామని బీరాలు పలికిన బీజేపీ పెద్దలు ఇప్పుడెందుకు నోర్మూసుకుని కూర్చున్నారన్నారు. 2019లో వచ్చే ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి రావడానికి జాతీయ రాజకీయాల్లో శక్తిమంతమైన చంద్రబాబు అండ ఉండక తప్పదనే భావనలో మోడీ ఉన్నారని, అందుకే చంద్రబాబును ఇప్పుడే తొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Pawan Kalyan tweet on Muni Koti's death

జగన్ మద్దతు తీసుకునే పరిస్థితి కూడా రావచ్చనే రెండో ఆలోచన కూడా మోడీ మదిలో ఉందన్నారు. ఈ రెండు కారణాలవల్లే ఏపీకి చెందిన ఇద్దరు నేతలను ఆయన ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవడబ్బ సొమ్మునూ సీమాంధ్రులు అడగడం లేదని, హామీ మేరకు ప్రత్యేక హోదా ఇస్తే చాలని మాత్రమే కోరుకుంటున్నారన్నారు.

గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన బీజేపీ నేతలకు అంత సీన్ లేదని ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, ఒక్క సీటు గెలిపించుకోవడం బీజేపీ తరం కాదన్నారు. ఆంధ్రుడైన వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలని, లేకపోతే ఏపీలో తన అస్తిత్వం కోల్పోక తప్పదన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan tweet on Muni Koti's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X