వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనిరాజు.. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇదిగో!: మళ్లీ షాకిచ్చిన పవన్ కళ్యాణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనకు లీగల్ నోటీసులు అందిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమాత్రం తగ్గడం లేదు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేస్తున్నారని భావిస్తున్న మీడియా యజమానులపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి శ్రీనిరాజుకు చెందిన పలు అంశాలను ట్వీట్ చేశారు. టీడీపీకి ఇచ్చిన విరాళానికి సంబంధించిన జాబితాను పోస్ట్ చేశారు.

'బాలకృష్ణకు చికిత్స అవసరం, మోడీ మాటలు సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు!!''బాలకృష్ణకు చికిత్స అవసరం, మోడీ మాటలు సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు!!'

అందులోని పాన్ కార్డ్ నెంబర్, పేరు తదితరాలను కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో మరో ట్వీట్ కూడా చేశారు. 2009-10 మధ్య టీడీపీకి విరాళం ఇచ్చిన శ్రీనిరాజు ఇతనే అని చెప్పేందుకు మరో ఆధారాన్ని సాయంత్రం పోస్ట్ చేశారు. ట్యాక్స్ పేమెంట్‌కు చెందిన ఆధారాన్ని చూపించారు.

 ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే, మరిన్ని వివరాల కోసం

ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే, మరిన్ని వివరాల కోసం

అంతకుముందు టీడీపీకి రూ.1 డొనేషన్ శ్రీనివాసరాజు చలపతి ఇచ్చినట్లుగా జాబితాను ఇచ్చి, పాన్ కార్డ్, అతని పేరు, అడ్రస్ స్పష్టంగా కనిపించేలా పోస్ట్ చేశారు. అయితే, ఎవరైనా కన్ఫ్యూజ్ వెరిఫికేషన్ కోసం మరిన్ని వివరాలు అంటూ మరో ఆధారాన్ని పోస్ట్ చేశారు. రెండింటిలోను ఆధార్ కార్డ్ ఒకటే ఉంది.

మరోసారి పవన్ కళ్యాణ్ పైన

మరోసారి పవన్ కళ్యాణ్ పైన

మరోవైపు, పవన్ కళ్యాణ్‌ను విమర్శించి అందరి నోళ్లలో నానిన మహేష్ కత్తి మళ్లీ జనసేనానిని టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన తన సామాజిక అనుసంధాన వేదికలో ఓ పోస్ట్ పెట్టారు. ఇటీవల ఫిలిం ఛాంబర్లో పవన్ ఓ ఇద్దరు యువకులతో దిగిన ఫోటోను పోస్ట్ చేసి తనపై కోడిగుడ్లతో దాడి చేసిన వారు వీరేనని చెప్పారు.

 నా మీద దాడి చేసింది వీరే

నా మీద దాడి చేసింది వీరే

తన పోస్టులో.. పవన్ కళ్యాణ్: రాజకీయాలలో ఒక అరాచక శక్తి అని పేర్కొంటూ.. 'ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు నా మీద కోడిగుడ్లతో దాడి చేసిన యువకులు. తన మీద దాడిని ఏనాడూ ఖండించని పవన్ కల్యాణ్ దాడి చేసిన అభిమానులను పిలిచి మరీ అభినందించడం దేనికి చిహ్నం? మొన్నటికి మొన్న ఫిల్మ్ ఛాంబర్‌కి అభిమానుల్ని పిలవడం వెనక దాగున్న మతలబు, అమ్మ సెంటిమెంటుని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలని సాధించడం కాదా! అభిమానుల కోసం పవన్ అక్కడికి రాలేదు. తన అక్కసు వెళ్లగక్కడానికి. మా అసోషియేషన్ ను టెర్రరైజ్ చేసి. మీడియా మీద వార్ ప్రకటించడానికి వచ్చాడు. అభిమానుల ఆవేశాన్ని తన ఆయుధం గా మలుచుకోవడానికి ప్లాన్ వేసుకునే వచ్చాడు. అక్కడ జరిగింది అదే. ఆంధ్రజ్యోతి వాహనాల మీద దాడి. దాడి చేసిన అభిమానుల్ని అరెస్టు చేస్తే, వాళ్ళని విడిపించడం మానుకుని, అది కూడా మీడియా ఆరాచకమే అని కలర్ ఇస్తున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఏకం చేసి, వివిధ ప్రదేశాలలో అభిమానులను రెచ్చగొట్టే ప్రసంగాలని చేయిస్తున్నాడు.' అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్

పవన్ కళ్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్

'అన్నపూర్ణ స్టూడియోలో 24 క్రాఫ్ట్స్ మీటింగ్ అని పిలిచి. అభిమానులు అక్కడా హంగామా చేసేలా చేసి, పవన్ మాత్రం రాకుండా, మీడియాని అభిమానుల్ని తప్పుదోవ పట్టించాడు. దీని వెనక ఒక హింసాత్మక కుట్ర పునాది దాగుందని నాకు అనిపిస్తే అది నా తప్పే అవుతుంది. కానీ ఈ ఫోటో చూసాక, అది అసాధ్యం కాని కుట్ర అనిపించి రాస్తున్నాను.

రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కోసం చస్తాం. చంపుతాం అనే యువత ఎంతలేదన్నా ఒక 10 నుంచీ 20 వేల మంది ఉంటారు. పవన్ కి వ్యతిరేకం అనుకుంటున్న మీడియా మీద. పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేని మనుషుల్ని అటాక్ చెయ్యడానికి.రాష్ట్ర వ్యాప్తంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలజడికి సృష్టించడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్ర ఇది. మీడియా ప్రముఖుల పేర్లు, ఫోటోలు బయటపెట్టి బెదిరించడం వెనక. నాలాంటి వాళ్ళ ఇంటి అడ్రస్సులు వాళ్ళ చెంచాల ద్వారా బయట పెట్టించడం వెనక ఇదే కుట్ర ఉంది.
త్వరలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టింపబడుతుంది. పవన్ ను పిచ్చిగా అభిమానించే కాపు-దళిత యువకులు ఈ కుట్రలో సమిధలు అవుతారు. చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయి. పవన్ కళ్యాణ్ కింగ్ అవొచ్చు. లేదా కింగ్ మేకర్ అవొచ్చు.' అని మహేష్ కత్తి పేర్కొన్నారు.

 ఎప్పుడో ఇచ్చిన పార్టీ ఫండ్

ఎప్పుడో ఇచ్చిన పార్టీ ఫండ్

మరోవైపు, శ్రీనిరాజుకు టీడీపీకి ఇచ్చిన పార్టీ ఫండ్ అంశాన్ని ఇప్పుడు పవన్ బయటపెట్టడంపై కూడా మహేష్ కత్తి స్పందించారు. 'పవన్‌కు పిచ్చెక్కింది. ఎందుకంటే, ఒక బిజినెస్ మ్యాన్ కట్టిన పార్టీ ఫండ్. అదీ 2009-10 లో ఇచ్చింది బైటపెట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. పర్సనల్ అడ్రస్ హైలైట్ చేసి పెట్టడం ఫ్యాన్స్ ని అటాక్ చేయమని చెప్పడానికా!' అని ప్రశ్నించారు.

English summary
Jana Sena chief Pawan Kalyan refused to slow down on monday in his attack against some big Telugu media houses even after receiving a legal notice from industrialist Srini Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X