వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా కోసం తిరగబడుతాం.. కేంద్రం మెడలు వంచుతాం..: పవన్

'ఆంధ్రప్రదేశ్ యువత శాంతియుత పంథాలో తమ గొంతు వినిపించాలి. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా సాధన హామికి అదే పరిష్కార మార్గం" అని పవన్ తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్షిణాదిపై ఉత్తరాది రాజకీయాల చిన్నచూపును ఎండగడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై తిరగబడతాం అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ స్పందించారు. జల్లికట్టు ఉద్యమస్పూర్తితో ప్రత్యేక హోదా సాధనకు ఏపీ ప్రజలు సన్నద్దం కావాల్సిన అవసరముందని తన వ్యాఖ్యల ద్వారా పవన్ తెలియజేశారు. 'తిడితే భరించాం.. విడగొట్టి గెంటేస్తే.. సహించాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరబడుతాం' అన్న విషయాన్ని ఏపీ యువత కేంద్రానికి తెలియజెప్పాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan tweets on special status and North politics

ఇక ఉత్తరాది రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. 'గాంధీజీని ప్రేమిస్తాం.. అంబేడ్కర్ ను ఆరాధిస్తాం.. సర్దార్ పటేల్ కు సెల్యూట్ చేస్తాం.. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కానీ తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే చూస్తూ కూర్చోం. మెడలు వంచి కింద కూర్చోబెడుతాం' అంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు పవన్.

దక్షిణాదిలో ఎన్ని భాషలున్నాయో అసలు ఉత్తరాది నాయకులకు తెలుసా? అని ప్రశ్నించిన పవన్.. దక్షిణాది వారిన మదరాసీల అని పిలుస్తూ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో నైతికత లేని రాజకీయాలు నడుస్తున్నాయని, బాధ్యత, సమగ్రత కొరవడిందని తన ట్వీట్స్ ద్వారా పవన్ పేర్కొన్నారు.

హోదాను సాధించుకునేందుకు శాంతియుత పంథాలో యువత పోరాటం చేయాల్సిన అవసరముందని తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ యువత శాంతియుత పంథాలో తమ గొంతు వినిపించాలి. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా సాధన హామికి అదే పరిష్కార మార్గం" అని పవన్ తెలిపారు.

English summary
'Youth of AP"should raise their voice through peaceful protests is the only remedy ,to achieve the promised special status' said Janasena President Pawan Kalyan through twitter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X