వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్-పవన్‌లు తొలిసారి ఇలా..: హడావుడిగా వెళ్లిన జనసేనాని, ఇరకాటంలో బాబు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ, బీజేపీ, వైసీపీలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సోమవారం రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు పవన్-జగన్‌లు నేరుగా ఘాటైన సవాళ్లు చేసుకున్న సందర్భాలు లేవని చెప్పవచ్చు.

Recommended Video

YSRCP MLA Roja questions Pawan over JFC

జగన్! నీకు నేనున్నా, అవిశ్వాసం పెట్టు: పవన్ కళ్యాణ్ రెడీజగన్! నీకు నేనున్నా, అవిశ్వాసం పెట్టు: పవన్ కళ్యాణ్ రెడీ

కానీ, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో మాత్రం పవన్, జగన్‌లు నేరుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. అవిశ్వాస తీర్మానం అంశాన్ని పవన్ కోర్టులోకి నెట్టుదామని జగన్ అనుకుంటే జనసేనాని తిరిగి వైసీపీ కోర్టులోకి నెట్టి వేశారు. ఓ విధంగా వైసీపీని ఇరుకున పడేశారు.

చదవండి: జగన్ సవాల్‌కు వెనుకంజ: అవిశ్వాసంపై ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్య, మోడీపై మళ్లీ

 జగన్‌తో పాటు చంద్రబాబు ఇరుకున

జగన్‌తో పాటు చంద్రబాబు ఇరుకున

వైయస్ జగన్‌కు దమ్ముంటే కేంద్రంపై ఎదురు తిరగాలని పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. మార్చి 4న తాను ఢిల్లీకి వస్తున్నానని, మార్చి 5న వైసీపీ ఎంపీలు అవిశ్వాసంతో పార్లమెంటులో అడుగు పెట్టాలని సవాల్ చేశారు. ఈ విషయంలో జగన్ ఇరుకున పడ్డారని చెప్పవచ్చు. అదే సమయంలో చంద్రబాబును కూడా పవన్ ఇరుకునపడేశారని చెప్పవచ్చు.

జగన్‌తో పాటు ఇరుకునపడ్డ బాబు

జగన్‌తో పాటు ఇరుకునపడ్డ బాబు

జగన్ అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం పార్టీ వైఖరి కూడా తెలుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ వెనుకంజ వేసినప్పటికీ.. వైసీపీ నిజంగానే దానిని పెడితే అప్పుడు చంద్రబాబు కూడా ఇరుకున పడతారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం లేదా ఏపీ ప్రయోజనాల కోసం వైసీపీ అవిశ్వాసం పెడితే టీడీపీ మద్దతివ్వకుంటే చంద్రబాబును తప్పుబట్టే పరిస్థితి వస్తుంది.

కేంద్రాన్ని అడుక్కున్నాం, తలాతోక లేని జగన్: బాబు కీలక సంకేతాలు, పవన్‌తో మాట్లాడుతాకేంద్రాన్ని అడుక్కున్నాం, తలాతోక లేని జగన్: బాబు కీలక సంకేతాలు, పవన్‌తో మాట్లాడుతా

 జగన్ సవాల్, చంద్రబాబు వెనక్కి

జగన్ సవాల్, చంద్రబాబు వెనక్కి

ఇదిలా ఉండగా, పవన్, జగన్‌లు గట్టి సవాళ్లు చేసుకోవడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. ప్రత్యేక హోదా లేదా ఏపీ ప్రయోజనాలపై వైసీపీ, టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టవచ్చు కదా అని పవన్ రెండు రోజుల క్రితం ప్రకటించగా, వెంటనే జగన్ స్పందించారు. చంద్రబాబు మాత్రం వెనక్కి పోయారు. దీంతో పవన్ సోమవారం మీడియా ముందుకు వచ్చి జగన్ సవాల్‌కు ప్రతి సవాల్ విసిరారు.

పవన్ ఇప్పుడు చెప్పు, మీ మధ్య ఏముంది: బొత్స, అవిశ్వాసానికి బాబు నో చెప్పడం వెనుక..పవన్ ఇప్పుడు చెప్పు, మీ మధ్య ఏముంది: బొత్స, అవిశ్వాసానికి బాబు నో చెప్పడం వెనుక..

 హడావుడిగా వెళ్లిపోయిన పవన్

హడావుడిగా వెళ్లిపోయిన పవన్

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో కేవలం అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడి ఆ తర్వాత హడావుడిగా వెళ్లిపోయారు. ఆయన ముందే కేవలం జగన్ సవాల్ పైన మాట్లాడాలని నిర్ణయించుకొని వచ్చినట్లుగా ఉంది.

అక్కడ తెగదెంపులు, టీడీపీని వదులుకోలేం: బీజేపీ మంత్రి సంచలనం, అనితది నిజమేనని విష్ణుఅక్కడ తెగదెంపులు, టీడీపీని వదులుకోలేం: బీజేపీ మంత్రి సంచలనం, అనితది నిజమేనని విష్ణు

English summary
Jana Sena chief Pawan Kalyan challenged YSR Congress Party chief Pawan Kalyan over No Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X