వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు రాజ్ చిక్కులు: తేలిపోయిందని పవన్, విజయసాయి, హోదాపై సీఎం వైఖరి అంటూ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లినప్పటికీ చంద్రబాబు తమకు మిత్రుడేనని ఆయన చెప్పారు. ఇది ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఆయన వ్యాఖ్యల ఆధారంగా ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో బీజేపీ, టీడీపీ మధ్య ఉన్న బంధం, రహస్య ఒప్పందం తేలిపోయిందని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ప్రశ్నించారు.

Pawan Kalyan and Vijaya Sai Reddy drags Chandababu Naidu with Rajnath Singh Comments

'ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి,ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లల లాగా... కేంద్రం చేత మోసగింపపడ్డాం ..అంటే,ప్రజలు నమ్ముతారు .. అని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారు?' అని పవన్ ట్వీట్ చేశారు.

'రాజనాథ్ సింగ్ గారి మాటలు " ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే అంటం " చూస్తుంటే.. టీడీపీ - బీజేపీ ఇంకా కలిసి ఉన్నాయని స్పష్టమౌతుంది. ఇద్దరు కలిపి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు అనిపిస్తుంది.' అని మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఏఏ సందర్భాల్లో ఎలా మాట మార్చారో ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు.

తెలుగుదేశం, టీడీపీ బంధం లోకసభ సాక్షిగా బయటపడిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలతో ఆ రెండు పార్టీల స్నేహం వెలుగు చూసిందన్నారు..

English summary
At every stage TDP had colluded & compromised with BJP leadership on SCS. Now what they are doing is eye wash & political theatrics for public consumption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X