గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు గుంటూరులో...పవన్ కళ్యాణ్ పర్యటన

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ గుంటూరు పర్యటన : మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు !

గుంటూరు: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. అతిసారంతో చనిపోయిన వారి కుటుంబాలను ఆయన శుక్రవారం పరామర్శించనున్నారు. అలాగే డయేరియా బాధితులతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పవన్ కలవనున్నారని తెలిసింది.

అతిసారం బారిన పడి గుంటూరులో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. మరోవైపు గుంటూరులో కలరా విజృంభణ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు ముగ్గురు మంత్రులను ఆదేశించారు. ఆ ముగ్గురు మంత్రులు కూడా నేటి నుంచి గుంటూరులో అతిసార నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.

పవన్ నేడు...గుంటూరు రాక

పవన్ నేడు...గుంటూరు రాక

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. కలరా బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అతిసార బాధితులను, ఇతర రోగులను ఆయన పరామర్శించనున్నారు. పవన్ రాకతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవ మహా సభలో అమరావతి గురించి కన్నీళ్లు పెట్టుకున్న ముఖ్యమంత్రికి గుంటూరు కలరా మృతులను చూస్తే కన్నీళ్లు రాలేదా అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యతగా పవన్ తాను కూడా గుంటూరులో అతిసారంతో చనిపోయిన వారి కుటుంబాలని పరామర్శించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ నోట...గుంటూరు మాట...

పవన్ నోట...గుంటూరు మాట...

నవ్యాంధ్ర రాజధాని నడిబొడ్డున తొలిసారిగా జనసేన పార్టీ బుధవారం భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ మాట్లాడుతూ తాను అమరావతి సహజ పౌరుడినని...గుంటూరు జిల్లా వాసినేనని...అందుకు వివరణగా తాను బాపట్లలో పుట్టానని...తన తండ్రి కానిస్టేబుల్ గా మంగళగిరిలో పనిచేశారని, తాను మంగళగిరిలో పెరిగానని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇదే సభలో పవన్‌ కళ్యాణ్‌ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి భూములు తీసుకున్న వ్యవహారాల నుంచి లంక భూముల రైతులు ఎదుర్కొంటున్న అనేక స్థానిక సమస్యల గురించి ప్రస్తావించడం గమనార్హం. రాజధాని నిర్మాణానికి 1500 నుంచి 2 వేల ఎకరాల భూములు సరిపోయేవి. అలాంటిది 33 వేల నుంచి లక్ష దాకా పోతోందని పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తనకు చెప్పుకొని బాధపడ్డారన్నారు. రైతుల నుంచి సమీకరించిన భూములకు ప్రభుత్వం ఇచ్చిన హమీ పత్రాలు చెల్లుతాయా లేదా అన్న అనుమానం, ఆందోళనలో ఉన్నారంటూ పవన్‌ ప్రస్తావించారు.

స్థానిక సమస్యల గురించి...లోతుగా...

స్థానిక సమస్యల గురించి...లోతుగా...

ఆవిర్భావ దినోత్సవం సభ ప్రారంభం కాకముందే రాజధాని నుంచి వచ్చిన రైతులను సభా వేదిక వద్దకు రావాలని పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.అలాగే తన ప్రసంగంలో గుంటూరు కలరా మరణాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు...విజయవాడలోని దుర్గగుడి పార్కింగ్‌ ఫీజుల అంశం, తెదేపా నాయకుల వాటాల వ్యవహారం ప్రస్తావిస్తూ స్థానిక స్పందన రాబట్టగలిగారు. దుర్గగుడి పార్కింగ్‌ ఫీజుల నుంచి కూడా తెదేపా ఎమ్మెల్యేకు వాటాలు పంపాల్సి రావటం దురదృష్టకరం అన్నారు.

ఉగాది వరకు ఇక్కడే...సత్తా చూపిస్తాం...

ఉగాది వరకు ఇక్కడే...సత్తా చూపిస్తాం...

ఈ నెల 18వ తేదీ వరకు తాను ఇక్కడే ఉంటానని, ఉగాది పండుగ ఇక్కడే జరుపుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ప్రత్యేక హోదా సాధన కోసం చేసే పోరాటానికి కలిసి వచ్చే పార్టీలతో పార్టీ కార్యాలయంలో చర్చలు జరుపుతానని అన్నారు. ప్రత్యేక హోదా కార్యాచరణకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. జనసేనకు క్యాడర్ లేదు...బలం లేదు అని ఏవేవో మాట్లాడుతున్న వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సత్తా చూపిస్తామని పవన్ ప్రకటించిన నేపథ్యంలో స్థానికంగా ఉంటూ స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానికంగా...పవన్ అభిమానులు ఎక్కువే..

స్థానికంగా...పవన్ అభిమానులు ఎక్కువే..

పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే కాపు యువతతో పాటు సాధారణ వీరాభిమానులు కూడా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువే ఉన్నారు. అందుకు నిదర్శనం మార్చి 14 న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం మహా సభకు ఈ రెండు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీలుగా తరలిరావడమే. అలాగే నూజివీడు నుంచి విద్యా సంస్థల అధినేత ఒకరు తమ కళాశాలకు చెందిన విద్యార్థులను పెద్ద ఎత్తున బస్సుల్లో తీసుకువచ్చినట్లు తెలిసింది. వాలంటీర్లుగా కూడా ఈ రెండు జిల్లాలకు చెందిన పలు ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు వ్యవహరించడం గమనార్హం...మొత్తం మీద పవన్ఆవిర్భావ సభలో తానే చెప్పినట్లు ఇక ప్రతి అడుగు వ్యూహాత్మకంగా, ప్రజామన్ననలు పొందే విధంగా వేయనున్నట్లు స్పష్టమవుతోంది.

English summary
Guntur: Janasena's chief Pawan kalyan will visit Guntur today. He will visit the families of the deceased of cholera. In this background, police made a strong security arrangements for his tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X