వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ రాజధాని అమరావతి గ్రామాల పర్యటన నేడే ... పోలీసుల ఆంక్షలతో సర్వత్రా ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్.. రాజధాని తరలింపుపై దీక్ష చేస్తున్న రైతులకు మద్దతు తెలపనున్నారు. మంగళగిరి జనసేన పార్టీ ఆపీసు నుంచి బయలుదేరనున్న జనసేనాని.. యర్రబాలెం, పెనుమాక, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో దీక్ష చేస్తున్న వారితో పాటు రాజదాని రైతులకు పవన్ సంఘీభావం తెలపనున్నారు. అయితే పవన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు కాస్త ఇబ్బందిగా మారాయి.

 పీక్ టైమ్ లో రెండు పడవల మీద కాళ్ళు పెట్టిన పవన్ .. సినిమాలు , రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తారా పీక్ టైమ్ లో రెండు పడవల మీద కాళ్ళు పెట్టిన పవన్ .. సినిమాలు , రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తారా

 గతంలో ఒకమారు పవన్ రాజధాని పర్యటన

గతంలో ఒకమారు పవన్ రాజధాని పర్యటన

ఇప్పటికే రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రాజధాని ప్రాంత ప్రజలకు మద్దతు తెలపాలని రాజధాని గ్రామాల్లో పర్యటించిన జనసేనాని మరోసారి రైతుల వద్దకు వెళ్తున్నారు. బీజేపీతో పొత్తు ప్రకటన చెయ్యక ముందు నాలుగు గ్రామాల్లో పర్యటించిన పవన్ ను పోలీసులు పవన్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో వారిని పరామర్శించేందుకు వెళ్లాలని పవన్ ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో అది వాయిదా పడింది.

రాజధాని గ్రామాల పరిస్థితులు తెలుసుకునే మరోమారు పవన్ టూర్

రాజధాని గ్రామాల పరిస్థితులు తెలుసుకునే మరోమారు పవన్ టూర్

ఇక గతంలో ఎదురైనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని గ్రామాల్లో పర్యటనకు ముందు అక్కడి పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్నారు పవన్. బీజేపీ, జనసేన నేతలు సంయుక్తంగా రాజధాని గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పవన్‌కు వివరించారు. ఇలా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత పవన్ ఇవాళ రాజధానికి వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది . ఇక నేడు పవన్ టూర్ నాలుగు గ్రామాలలో ఉండనుంది. పవన్ పర్యటనను విజయవంతం చేసేందుకు రాజధాని ప్రాంతంలోని జనసైనికులు సిద్ధమయ్యారు. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పవన్ టూర్ ఎలా జరుతుందనేది సస్పెన్స్ గా మారింది.

పవన్ రాజధాని గ్రామాల పర్యటనా షెడ్యూల్

పవన్ రాజధాని గ్రామాల పర్యటనా షెడ్యూల్


జనసేన ప్రకటించినట్టు పవన్ పర్యటన వివరాలను చూస్తే ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం అవుతుంది . ఉదయం 9గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పర్యటన మొదలు పెట్టి 9.30 గంటలకు ఎర్రబాలెం, 10 గంటలకు మందడం, 10.30 గంటలకు వెలగపూడి, 11 గంటలకు రాయపూడి, 11.30 గంటలకు తుళ్లూరు, మధ్యాహ్నం 12 గంటలకు అనంతవరం గ్రామాల్లో పవన్ పర్యటన సాగనుంది .

పవన్ టూర్ నేపధ్యంలో రాజధాని గ్రామాల్లో టెన్షన్

పవన్ టూర్ నేపధ్యంలో రాజధాని గ్రామాల్లో టెన్షన్

అమరావతి ప్రాంతంలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. సుమారు 60 రోజులుగా రాజధానిపై ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా.. ఇటీవల కాలంలో రాజకీయ ముఖ్య నాయకుల రాకపోకలు తగ్గిపోయాయి . ఇక ఈ నేపధ్యంలో తాజాగా పవన్ రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్ళటం రాజధాని గ్రామలా ప్రజల్లో జోష్ పెంచుతుంది. గతంలో పోలీసుల దాడిలో గాయపడిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. రైతుల కోరిక మేరకే ఆయన ఈ పర్యటన చేస్తున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

 భారీగా మోహరించిన పోలీసులు ...అడుగడుగునా ఆంక్షలు

భారీగా మోహరించిన పోలీసులు ...అడుగడుగునా ఆంక్షలు

ఇక పవన్ పర్యటన నేపధ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని చెబుతున్న రూట్లలో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. మొన్నటి వరకు తొలగిస్తూ వచ్చిన పోలీసు పికెట్లను తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. భారీగా పోలీసులు మొహరించటంతో రాజధాని ప్రాంత గ్రామాలు మళ్ళీ టెన్షన్ వాతావరణంలోకి చేరుతున్నాయి. మరి నేడు పవన్ పర్యటన అడుగడుగునా ఆంక్షల మధ్య ఎలా సాగుతుందో వేచి చూడాలి .

English summary
Janasena president Pawan Kalyan is scheduled to tour Amaravati villages today. Police alerted on Pawan's visit. Huge forces are deployed along the route that Pawan Kalyan is planning to visit. Police pickets that have been removed until now are being restored. With the heavy police presence, the villages of the capital are once again entering a tense atmosphere. Today, we have to wait and see how the Pawan tour goes between restrictions at every step.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X