వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని కోసం అవసరానికి మించి భూములు ఎందుకు..?:పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని లంక భూముల రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. లంక భూముల రైతుల విన్నపం మేరకు ఆయన రాజధానిలో సమస్యా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

ఆదివారం ఉదయం చెన్నూరు మండలం ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా పవన్‌ లంక భూములను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులతో పవన్‌ సమావేశమయ్యారు. ఇక్కడ జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను సమస్యను పరిష్కరించలేనని, అయితే సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లగలనని అన్నారు.

Pawan Kalyan Visited Uddandarayunipalem farm lands

మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, అయినా ప్రభుత్వం స్పందించకుంటే 2019 ఎన్నికల్లో ఈ విషయాన్ని ముందు పెడతామని అన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి మరో రెండు దశాబ్దాలు పడుతుందన్నారు. రాజధాని అమరావతికి ఇప్పుడు సిద్దం చేసిన మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాదని, అందులో మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే రాజధాని కోసం ఒకేసారి అవసరానికి మించి భూములు ఎందుకు తీసుకుంటున్నారంటూ పవన్ టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

English summary
Amaravathi: Jana Sena Chief Pawan Kalyan met farmers of Uddandarayuni Palem who gave away their farm lands to the government for construction of Capital. Pavan has participated in Ugadi Celebrations here. It is known that Pawan met the farmers on multiple occasions, but this meet has prominence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X