శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నీళ్లు ఆగట్లేదు, బెదిరిస్తే తోలుతీస్తా: తుఫాను బాధిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: జిల్లాలోని తుఫాను బాధిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం పర్యటించారు. టిట్లీ తుఫాను సృష్టించిన విధ్వంసంతో జరిగిన నష్టం బయటకు తెలియడంలేదని ఈ సందర్భంగా పవన్ శ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు చిరంజీవి గుడ్‌బై?: సభ్యత్వం పునరుద్ధరించుకోలేదు! రాహుల్ కోరినా.., పవన్ ఉండగా..?కాంగ్రెస్‌కు చిరంజీవి గుడ్‌బై?: సభ్యత్వం పునరుద్ధరించుకోలేదు! రాహుల్ కోరినా.., పవన్ ఉండగా..?

కన్నీళ్లు ఆగట్లేదు కానీ..

కన్నీళ్లు ఆగట్లేదు కానీ..

తుఫానుతో నష్టపోయిన శ్రీకాకుళం ప్రజల కష్టాలు చూసి తనకు కన్నీళ్లొచ్చాయని తెలిపారు. తాను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదని.. ఆవేదనను తన గుండెల్లోనే పెట్టుకున్నానని చెప్పారు.

Recommended Video

నన్ను సీఎం అనండి అని అడిగి పిలిపించుకున్న పవన్
 మూడు రోజులపాటు ఇక్కడే..

మూడు రోజులపాటు ఇక్కడే..

బుధవారం పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా భావనపాడు, టెక్కలిలో పర్యటించారు. సిక్కోలు ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన పెను తుఫాను టిట్లీ బాధితుల కష్టాలను తెలుసుకొనేందుకు మూడు రోజులు శ్రీకాకుళం జిల్లాలోనే పర్యటించనున్నట్టు చెప్పారు.

 తోలుతీస్తానంటూ హెచ్చరిక

తోలుతీస్తానంటూ హెచ్చరిక

తుఫానుతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని పవన్ తెలిపారు. ప్రజలను కొందరు అధికారులు బెదిరిస్తున్నారని, ఎవరైనా ప్రజల్ని బెదిరిస్తే తోలు తీస్తానని పవన్‌ హెచ్చరించారు.

అండగా ఉంటా..

తుఫాను బాధిత టెక్కలి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ రాకతో అక్కడికి భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.

English summary
Janasena president Pawan Kalyan visited Cyclone affected areas in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X