• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రిషికేశ్‌లో పవన్ కళ్యాణ్ ఆసక్తికరం: ఏం చేస్తున్నారంటే..?

|

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాదిలో తన పర్యటన కొనసాగిస్తున్నారు. హరిద్వార్ ఆశ్రమంలో బస చేసి పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం పుణ్యక్షేత్రమైన రిషికేశ్‌లో పవిత్ర గంగా నదిని సందర్శించారు.

సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్! పసుపు రంగు పడింది!! కేసులు కూడా..సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్! పసుపు రంగు పడింది!! కేసులు కూడా..

హిమాలయ సానువుల్లో..

హిమాలయ సానువుల్లో..

తొలుత రిషికేశ్‌లోని గంగా బ్యారేజ్ చేరుకుని అక్కడ గంగా నది ప్రవాహ ఝురిని, ఒరవడిని ఆసక్తిగా తిలకించారు జనసేనాని. హిమాలయ సాణువుల్లో ఉద్భవించే గంగా నది అక్కడి నుంచి పరవళ్లు తొక్కుతూ రిషికేశ్‌కు చేరుకునే వైనాన్ని విక్రం సోని, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌లు వివరించారు.

మనమంతా కలిసి..

మనమంతా కలిసి..

గంగా నీటిలో 42 రకాల ఔషద లక్షణాలు ఉన్నాయని వివరించిన వారు, ఈ ఔషధ లక్షణాలున్న గంగా ప్రవాహం కలుషితం కాకుండా మనమంతా కలిసి పరిరక్షించుకోవాలని అన్నారు. బ్యారేజీ సందర్శనానంతరం గంగా ప్రధాన కాలువ వెంబడి ప్రయాణిస్తూ నీటి ఒరవడిని పరిశీలించారు పవన్ కళ్యాణ్.

గంగా కాలువ ఒడ్డున..

గంగా కాలువ ఒడ్డున..

కాగా, ప్రధాన కాలువ మార్గమంతా దట్టమైన అడవితో నిండి ఉంది. అటవీ మార్గం మధ్యలో చిల్లా అనే ప్రాంతంలో ఆగి కాసేపు గంగా కాలువ ఒడ్డున కూర్చుని తదేకంగా గంగను పరిశీలించారు పవన్.దాదాపు 15 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ అక్కడే గడుపుతూ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి హరిద్వార్ చేరుకుని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాత్రి ఆశ్రమానికి మరోసారి విచ్చేశారు పవన్.

ఆయన పోరాటాన్ని ఎవరూ పట్టించుకోలేదు..

ఆయన పోరాటాన్ని ఎవరూ పట్టించుకోలేదు..

గంగను స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలని, నదిలో కాలుష్యం చేరకుండా నియంత్రించాలని ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ చేసిన పోరాటం గురించి తాను ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండేవాడినని పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం హరిద్వార్‌లోని పవన్ సదన్ ఆశ్రమంలో జరిగిన జీడీ అగర్వాల్ సంస్మరణలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అగర్వాల్ ఆమరణ దీక్షకు కూర్చున్నారని తెలిసిందని, అయితే ఆయన ఆత్మత్యాగం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావించానని.. అయితే ఎవరూ ఆయన బాధను పట్టించుకోలేదన్నారు. అగర్వాల్ మృతితో దేశం మొత్తం తిరగబడుతుందని భావించానని.. కనీసం ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ప్రజా స్పందన రాకపోవడం శోచనీయమన్నారు.

ఆహ్వానం మేరకు

ఆహ్వానం మేరకు

కాగా, తెలుగు రాష్ట్రాల్లో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ ప్రథమ వర్ధంతికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. దీంతో తన ఆరోగ్యం సహకరించకున్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి హరిద్వార్‌లోని కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్. గత కొద్దికాలంగా పవన్ వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

మద్దతు ఇవ్వాలంటూ..

మద్దతు ఇవ్వాలంటూ..

మాత్రా ఆశ్రమానికి సంబంధించిన శివానంద మహారాజ్ గంగా ప్రక్షాళన పోరాటాన్ని పవన్ కల్యాణ్‌కు వివరించారు. గంగా ప్రక్షాళన కోసం స్వామి నిగమానంద సరస్వతి ఏ విధంగా పోరాటం చేశారు. 115 రోజులు నిరాహర దీక్ష చేసి ఎలా ప్రాణత్యాగం చేశారనే విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా పవన్ పలు సమస్యలపై చేస్తున్న పోరాటాలను అభినందించి.. గంగా ప్రక్షాళన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని సూచించారు.

English summary
Janasena President Pawan Kalyan on Friday visited rishikesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X