• search
 • Live TV
విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విజయనగరం:నేడే పవన్ పర్యటన:సభలకు భారీగా తరలివస్తున్న జనం

By Suvarnaraju
|

విజయనగరం:నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించనున్నారు. కురుపాం, పార్వీతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన జరుగుతుంది. ప్రజాపోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం పార్టీ వర్గాలతో చర్చలకే పరిమితమయ్యారు.

  నాకే ఆ పరిస్థితి ఉంటే..ఇక సామాన్యుల గతి ఏంటి?:పవన్

  అయితే పవన్ బస చేసిన బొబ్బిలిలోని సూర్య రెసిడెన్సీ వద్దకు అభిమానులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చి ఆయన్ను చూసేందుకు గంటల తరబడి ఎండలో నిరీక్షించారు. దీంతో పవన్‌ గేటు బయటకు వచ్చి వారిని పలకరించే ప్రయత్నం చేయగా అభిమానులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది వారిని నియంత్రించేందుకు విఫలయత్నం చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పవన్ పక్కనే ఉన్న ఓపెన్‌టాప్‌ వాహనంపైకి వెళ్లి అక్కడి నుంచి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు.

   తొలిరోజు...కోర్ కమిటీతో చర్చలు

  తొలిరోజు...కోర్ కమిటీతో చర్చలు

  విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజు మొత్తం కోర్‌కమిటీ సభ్యులతో చర్చలకే పవన్ సమయం కేటాయించారు. పార్వతీపురం డివిజన్‌లోని నియోజకవర్గాల పరిస్థితులపై చర్చించారు. స్థానిక సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పర్యటనలో ఆయన వీటిని ప్రస్తావించేందుకే ఆరా తీసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన కొద్ది మంది అభిమానులతో కూడా భేటీ అయినట్లు సమాచారం.

  గురువారం...పర్యటన ఇలా

  గురువారం...పర్యటన ఇలా

  జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ గురువారం పార్వతీపురం డివిజన్‌లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం మూడు గంటలకు కురుపాం సంతతోట కూడలిలో ఆయన అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిసింది. సాయంత్రం 4.30 కు పార్వతీపురం పాత బస్టాండు జంక్షన్ లో కార్యకర్తలు, అభిమానులను కలుసుకుని మాట్లాడతారు. ఆ తరువాత 6 గంటలకు బొబ్బిలి రైల్వే స్టేషన్‌ కూడలిలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి బొబ్బిలి సూర్యరెసిడెన్సీకి చేరుకుని బస చేస్తారు.

  పవన్ కోసం...పిచ్చిగా...

  పవన్ కోసం...పిచ్చిగా...

  పవన్ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారని తెలియగానే బుధవారం పలు ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి ఆయన్ని చూసేందుకు పడిగాపులు కాశారు. అయితే పవన్ రోజంతా కోర్ కమిటీ సభ్యులతో చర్చలకే సమయం కేటాయించడంతో మండుటెండలో రోజంతా నిరీక్షించినా తమ అభిమాన నాయకుడు కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనై పిచ్చిగా ప్రవర్తించారు. మక్కువకు చెందిన తిరుపతిరావు అనే వీరాభిమాని ఉదయం నుంచి నిరీక్షించినా పవన్‌ కనిపించకపోవడంతో హోటల్‌ ప్రధాన గేటుకు తలబాదుకోవడం మొదలెట్టడంతో పోలీసులు గట్టిగా పట్టుకుని నిలువరించారు. స్వయంగా ఎస్ఐ రవీంద్రరాజు కలుగచేసుకొని తిరుపతిరావును దూరంగా తీసుకువెళ్లి నచ్చజెప్పారు. మరో దివ్యాంగుడు కూడా తీవ్ర అసహనానికి లోనై చిన్నప్పటి నుంచి ఆయన అభిమానులమని, కనీసం ఒక్కసారైనా ఆయన మా మధ్యకు రాకపోతే ఎలా?అంటూ హిస్టీరిక్ గా కేకలు వేశారు. ఈ సమాచారం పవన్ కు తెలిసి రాత్రి ఏడుగంటల ప్రాంతంలో పై ఒపెన్‌టాప్‌ వాహనంపైకి ఎక్కి అభివాదం చేయడంతో అభిమానులు శాంతించారు.

   భారీగా జనం...జనసేన ఉత్సాహం

  భారీగా జనం...జనసేన ఉత్సాహం

  పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు జనం భారీగా తరలిరావడం మిగతా రాజకీయ పార్టీలనే కాదు జనసేన నేతలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా పర్యటన పూర్తి చేసుకున్న పవన్ కు ఆ జిల్లా పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో జనసేన పార్టీ శ్రేణులతో పాటు పవన్ కూడా సంతోషించినట్లు తెలిసింది. కారణం టిడిపి ఆరోపిస్తున్నట్లు జనసేనకు క్యాడర్ లేని మాట వాస్తవం...ఈ నేపథ్యంలో...సంస్థాగత నిర్మాణం లేకుండా...జనసమీకరణ జరపకుండా...ఇంకా చెప్పాలంటే...నియోజకవర్గాల్లోనే చెప్పుకోదగిన నేతలు లేని జనసేన పార్టీకి పవన్ మాత్రమే దిక్కు కాగా...ఆ విధంగానే పవన్ సభలు బ్రహ్మాండంగా సక్సెస్ కావడం

  ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Vijayanagaram:Janasena chief Pawan kalyan vijayanagaram district tour starts today. He will address public gatherings in the following places on Thursday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more