వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా సన్నాసి గాడు..పీకే గాడు అంటూ : చెలరేగిన మంత్రి పేర్ని నాని : నీవు మగాడివైతే...సవాల్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని తీవ్ర పదజాలంతో చెలరేగారు. మంత్రిని పవన్ కళ్యాణ్ ఆ సన్నాసి అంటూ వ్యాఖ్యానించటంతో..మంత్రి సైతం ధీటుగా సమాధానం ఇచ్చారు. తాను - పవన్ ఇద్దరం కాపు కులానికి చెందిన వాళ్లమే ..మేము ఎన్నో తిట్టుకుంటాము...ఆ పవన్ గాడు అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఏపీలో వకీల్ సాబ్ కు 50 కోట్ల వసూళ్లు వచ్చాయని వివరించారు. పవన్ కళ్యాణ్ కోసం సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నామంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పైన తీవ్రంగా స్పందించారు.

కేసీఆర్-మోదీ గురించి మాట్లాడాలంటే గజగజ

కేసీఆర్-మోదీ గురించి మాట్లాడాలంటే గజగజ

కోడి కత్తి కేసు ఎన్ఐఏ చూస్తుందని..దమ్ముంటే అమిత్ షా వద్దకు వెళ్లి నిలదీయాలని సూచించారు. తేజు యాక్సిడెంట్ పైన తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారాన్నే మీడియ ప్రసారం చేసిందని చెప్పుకొచ్చారు. దమ్ముంటే కేసీఆర్ ను..తెలంగాణ పోలీసులను తిట్టాలని డిమాండ్ చేసారు. జగన్ అంటే లోకువగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ గురించి మాట్లాడాలంటే గజగజ వణికిపోతున్నారని.. ఫ్యాంటు తడిసిపోతుందా అని నిలదీసారు. వచ్చిన రెమ్యునరేషన్ పైన పన్నులు కడుతున్నామని చెప్పారని..అదే మాట కేంద్ర పెద్దలను సన్నాసుల్లారా మేము కష్టపడితే మీకు పన్నులు ఏంటని ప్రశ్నించే దమ్ము ఉందా అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు.

మేమిద్దరం కాపులం..ఇలాగే తిట్టుకుంటాం

మేమిద్దరం కాపులం..ఇలాగే తిట్టుకుంటాం

పవన్ కు వచ్చే రెమ్యునరేషన్ తో ప్రభుత్వం నడుస్తోందా అని ప్రశ్నించారు. ఇక, తెలంగాణలో 519 ధియేటర్లకు గాను 413 మాత్రమే పని చేస్తున్నాయని చెప్పారు. నీవు పోటుగాడివి ఏంట్రా బాబు..అంటూ పవన్ కళ్యాణ్ సినిమాల లిస్టు చదివి..ఎన్ని హిట్ అయినవి చెప్పాలని డిమాండ్ చేసారు. బుడ్డాళ్లు..చిన్నాళ్లుకు వచ్చిన వసూళ్లు పవన్ కు రావని ఎద్దేవా చేసారు. పవన్ కు ఖర్చులు ఉంటాయని భరణాలు చెల్లించటానికి సరిపోతాయన్నారు. ఏపీలో 1100 ధియేటర్లలో 800 వరకు ఆడుతున్నాయని వివరించారు.

సినీ పెద్దలు కోరిన విషయం తెలియదా

సినీ పెద్దలు కోరిన విషయం తెలియదా

అదే విధంగా ఆన్ లైన్ టిక్కెట్ల గురించి సినీ పెద్దలే వినతి పత్రం ఇచ్చారంటూ ఆ లేఖలను బయట పెట్టారు. కాపులు ఒకరిని నమ్మితే అదే నమ్మకంతో ఉంటారని చెప్పుకొచ్చారు. పవన్ కు తిక్క కాదు..ఉందంతా లెక్కలేనని ఆరోపించారు. మా ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ వ్యాఖ్యలని విశ్లేషించారు. తామిద్దరం ఒక కాపులమని తిట్టుకుంటామంటూ అనేక తిట్లు తిట్టారు. పీకేగా అంటూ కాపు రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలను మంత్రి పేర్ని నాని ప్రస్తావించారు. నేను సన్నాసిని అయితే బందురు నుంచి ఎలా గెలుస్తానని ప్రశ్నించారు. పీకే సన్నాసి కాబట్టే భీమవరం..గాజువాక నుంచి ఓడిపోయారని వ్యాఖ్యానించారు.

కాపుల రిజర్వేషన్ల గురించి చంద్రబాబును అడగలేదేం

కాపుల రిజర్వేషన్ల గురించి చంద్రబాబును అడగలేదేం

గతంలో చంద్రబాబు అనేక మందికి అనేక హామీలు ఇస్తే ..చేయని వారిని ఎప్పడైనా ఏరా సన్నాసిగా.. చంద్రబాబుగా కాపులకు రిజర్వేషన్ ఇస్తానన్నావు... అని అడిగావా అని ప్రశ్నించారు. మాలో ఒకడిగా చెప్పుకోవటానికి సిగ్గేస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్రలో స్పష్టంగా రిజర్వేషన్ గురించి చెప్పారు. అది కేంద్ర ఇష్యూ అని..కాపుల డెవలప్ మెంట్ కోసం ఏడాదికి రెండు వేల కోట్లు ఇస్తానని మాట ఇచ్చారని గుర్తు చేసారు. కాపులు..బలిజలు ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చారో చెప్పాలన్నారు. అయిదేళ్లు వారిని సమర్ధించి.. వారు చెప్పింది చేసి వెళ్లిపోయావంటూ విరుచుకుపడ్డారు.

కాపులు ఎక్కడ ఎక్కువగా ఉంటే

కాపులు ఎక్కడ ఎక్కువగా ఉంటే

కాపులు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ నుంచి పోటీ చేసి ..ఓడిపోయిన పీకే మాట్లాడతావా అంటూ ఫైర్ అయ్యారు. దిల్ రాజు రెడ్డి- జగన్ రెడ్డి మాట్లాడుకోమని చెబుతావా అంటూ ఆగ్రహించారు. తనకు చిరంజీవి అంటే అభిమానమని..కాలేజీలు ఎగ్గొట్టి చిరు సినిమాల కోసం తపించే వాడినని వివరించారు. సినిమా ఇండస్ట్రీ ఆందోళనలో ఉందని.. జగన్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ ఏమైనా మిమ్మల్ని వేధిస్తుందా అంటూ మంత్రి ప్రశ్నించారు. తాజాగా లవ్ స్టోరీ కలెక్షన్లు గురించి ప్రస్తావించారు. పిచ్చి కూతలు-కారు కూతలు కూసే వారిని కంట్రోల్ చేయటానికి పెద్దలు మాట్లాడాలని సూచించారు.

English summary
Minister Perni Nani counters Pawan Kalyan who had slammed the AP Govt over ticketing system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X