వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ స్పందన కోసం వెయిటింగ్: మోడీ ప్రసంగంపై పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు భాషను కాపాడుకోవాలంటూ తన ఉద్యమాన్ని సాగిస్తున్నారు. మాతృ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల 'మన్ కీ బాత్'లో చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో మాతృభాష ప్రాధాన్యంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మిగితా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలని ఉందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు చేశారు.

మాతృభాష ప్రాధాన్యం, రాయలసీమ ముఠా సంస్కృతిపై కూడా పవన్ స్పందించారు. మాతృ భాషను కాపాడుకోవాలంటూ మోడీ చేసిన ప్రసంగానికి సంబంధించి.. పలు పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్‌లను తన ట్వీట్‌లకు జతపర్చారు. అలాగే రాయలసీమలో ముఠా కక్ష్యలు, పాలెగాళ్ల సంస్కృతిపై పౌరహక్కుల సంస్త 1996లో ముద్రించిన పుస్తకాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

pawan kalyan-చిన్న ప్రశ్న: 'హిందూ దేవాలయాలే ఎందుకు పన్నులు కట్టాలి?'pawan kalyan-చిన్న ప్రశ్న: 'హిందూ దేవాలయాలే ఎందుకు పన్నులు కట్టాలి?'

pawan kalyan waiting for ys jagans response on PM Modi speech on Mother tongue

'1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది. అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

'మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది ' రాయల సీమ లోనే,దళిత కులాల మీద దాడులు జరిగిన, బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది ,మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధలు వెళ్లపోసుకుంటుంటే నా గుండె కలిచి వేసింది. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది ' రాయల సీమ లోనే... కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని ,14 ఏళ్ల 'సుగాలి ప్రీతి ' ఉదంతమే దానికి ఉదాహరణ' అని పవన్ చెప్పుకొచ్చారు.

English summary
Janasena president Pawan Kalyan waiting for cM YS Jaganmohan Reddy's response on PM Modi speech on Mother tongue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X