వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ టీడీపీతో లోపాయికారి ఒప్పందం ... ఫైర్ అయిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

|
Google Oneindia TeluguNews

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ టీడీపీతో లోపాయికారి ఒప్పందంలోనే ఉన్నారని మంత్రి ఆరోపణలు గుప్పించారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో నే కాకుండా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగానే పని చేశాడని మండిపడ్డారు.

జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీదేవి .. డీజీపీకి నోటీసులు జారీ చేసిన కమీషన్జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీదేవి .. డీజీపీకి నోటీసులు జారీ చేసిన కమీషన్

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు వెల్లంపల్లి శ్రీనివాస్. జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు నచ్చక చాలామంది జనసైనికులు వైసిపి బాట పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమయ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు వైసీపీలో చేరిన సందర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ కండువా కప్పారు. వైసీపీలో చేరిన జనసేన పార్టీ నాయకులకు త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Recommended Video

కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారం కాదా..!! || Pawan Linked Kapu Reservations With Kashmir Issue
Pawan Kalyan was still in a defaulter deal with TDP... Minister vellampalli fire

ముందు ముందు జనసేన పార్టీ నుండి చాలామంది వైసీపీ లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శలు చేసినా వైయస్ జగన్ పాలనను చూసే అనేకమంది వైసీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక యువతకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా బిల్లు తెచ్చినట్లు చెప్పిన వెల్లంపల్లి శ్రీనివాస్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జగన్ చేసిన కృషి నిరుపమానమైనది అన్నారు. దేశచరిత్రల్లోనే కాంట్రాక్ట్ పనులు రిజర్వేషన్లు ప్రకారం అమలు జరగాలని చెప్పిన నాయకులు సీఎం జగన్ ఒక్కరేనని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అలాంటి పారదర్శక పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

English summary
Vellapalli Srinivas, Minister of State alleged that Janasena party chief Pawan Kalyan was still in a defaulter deal with the TDP.Janasena Party President Pawan Kalyan has been working as an affiliate of the Telugu Desam Party in the 2019 elections not only in the 2014 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X