• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రధాని మోడీని కలవనున్న పవన్ కళ్యాణ్: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై చర్చ

|

హైదరాబాద్/అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైసీపీ సర్కారు విఫలం కావడంతోనే ఇలా జరుగుతోందని టీడీపీ విమర్శిస్తుండగా.. అనవసరంగా అవాస్తవ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అధికార పార్టీ హెచ్చరించింది.

చిరంజీవి జనసేనలోకి..!? ఎప్పుడూ నా విజయమే కోరుకుంటారు: పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీని కలుస్తానంటూ పవన్ కళ్యాణ్

ప్రధాని మోడీని కలుస్తానంటూ పవన్ కళ్యాణ్

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగించింది నాటి ప్రధాని మన్మోహన్ సింగేనని ఈ సందర్భంగా పవన్ అన్నారు.

లక్ష మంది ఉద్యోగులు.. తెలుగువారికి ఆమోదం కాదు

లక్ష మంది ఉద్యోగులు.. తెలుగువారికి ఆమోదం కాదు

విశాఖ ఉక్కు కర్మాగారం... తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక. ఇటువంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమేనని జనసేన భావిస్తోంది. 22 వేల ఎకరాల్లో విస్తరించి 17 వేల మంది పర్మినెంట్, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సుమారు లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్న ఈ ప్లాంటు ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం అనేది జనసేన అభీష్టానికి వ్యతిరేకమని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒకసారి ఈ కర్మాగారం చరిత్ర పుటలను తిరగేస్తే ఈ కర్మాగారం ఆవిర్భావం కోసం 32 మంది ప్రాణాలను వదిలారు. వందలాది మంది నిర్భందాలకు గురయ్యారు. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇంతటి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగువారందరికీ ఆమోదయోగ్యం కాని విషయమేనని అన్నారు.

జనసేన తనవంతుగా కృషి..

జనసేన తనవంతుగా కృషి..

యూఏపీ పక్షాన ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెస్‌కు చెందిన మన్మోహన్ సింగ్ ముందుకు తీసుకెళ్లిన పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆ పరిధిలోకి చేరిన ఉక్కు కర్మాగారాన్ని ఇప్పటి పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుంది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాలను పవన్ కళ్యాణ్ కోరనున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రత్యక్షంగా ఈ విజ్ఞాపనను తెలుగువారి పక్షాన ఆయన తెలియచేస్తారు అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఉద్యమం మరింత ఉద్ధృత రూపం దాలుస్తోంది. దీనిపై రాజకీయ..కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. మహా ధర్నా చేపట్టిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నాయి.

English summary
pawan kalyan will meet PM Modi on Visakha steel plant privatization issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X