నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్! నువ్వు సీఎంవు అవుతావా: చిరంజీవిని లాగిన జవహర్, సిగ్గు రాలేదా: జగన్‌పై ఆదినారాయణ

|
Google Oneindia TeluguNews

అమరావతి/అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి జవహర్ ఆదివారం నిప్పులు చెరిగారు. కేంద్రం అవినీతిని ప్రశ్నించే దమ్ము పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. తనకు పౌరుషం ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీలో ఉన్నానని, తాకట్టు పెట్టే పార్టీలో లేనని చెప్పారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆడించినట్లుగా జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. నవ్యాంధ్రలో బీజేపీ కనీసం రెండు సీట్లు గెలవలేని పరిస్థితి అన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

చిరంజీవిని గెలిపించుకోని నీవు సీఎంవు అవుతావా?

చిరంజీవిని గెలిపించుకోని నీవు సీఎంవు అవుతావా?

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నయ్య చిరంజీవిని గెలిపించుకోలేని వ్యక్తి సీఎం అవుతారా అని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి జవహర్ అన్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఏపీకి ముఖ్యమంత్రి కాలేడా అని ఇటీవల జనసేనాని అన్నారు. దీనికి మంత్రి కౌంటర్ ఇచ్చారు.

చిరంజీవి ఎఫెక్ట్: 'సినిమా-పాలిట్రిక్స్'-పవన్ కళ్యాణ్‌కు వారసత్వంపై మాట్లాడే హక్కు ఉందా?చిరంజీవి ఎఫెక్ట్: 'సినిమా-పాలిట్రిక్స్'-పవన్ కళ్యాణ్‌కు వారసత్వంపై మాట్లాడే హక్కు ఉందా?

 జగన్‌కు చెక్ పెట్టే రోజులు

జగన్‌కు చెక్ పెట్టే రోజులు


తుఫాను సహాయక చర్యల్లో కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేయడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారని మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత వైయస్ జగన్‌కు చెక్ పెట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు.

నంద్యాలలో ఓడినా సిగ్గురాలేదా?

నంద్యాలలో ఓడినా సిగ్గురాలేదా?

అనుభవం లేని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. నంద్యాల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినా సిగ్గు రాలేదన్నారు. ఇక్కడి ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించిందని గుర్తు చేశారు.

చంద్రబాబుకు రూ.25 లక్షలు అందించిన బాలకృష్ణ

చంద్రబాబుకు రూ.25 లక్షలు అందించిన బాలకృష్ణ

టిట్లీ తుపాను బాధితుల సహాయార్థం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రూ.25 లక్షల ఆర్థికసాయాన్ని ఇటీవల ప్రకటించారు. ఈ రోజు (ఆదివారం) చంద్రబాబు హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి బాలకృష్ణ వెళ్లారు. అనంతరం తుపాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల చెక్కును చంద్రబాబుకు అందించారు. టిట్లీ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

English summary
Telugudesam Party leader and Minister Jawahar said that Jana Sena chief Pawan Kalyan will not become chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X