వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బాబుకు ఉన్న క్రేజ్ మోడీకిలేదు', 'పీఆర్పీతో ఆ ఫ్యామిలీ మోసం చేసింది, పవన్‌కు ఒక్క సీటు రాదు'

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న క్రేజ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేదని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న బుధవారం అన్నారు. అందుకే ప్రధాని, బీజేపీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డికి ట్రెయినింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మరో టీడీపీ నేత జవహర్ మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి పోటీ చేస్తే 18 సీట్లు అయినా వచ్చాయని, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఒక్క సీటు కూడా రాదని మండిపడ్డారు. పవన్ చాలా నీతి మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పీఆర్పీ పెట్టి ఆ కుటుంబం మొత్తం ప్రజలను మోసం చేసిందన్నారు.

చంద్రబాబు తుమ్మిదే అద్భుతం, దగ్గితే అద్భుతం: రాధాకృష్ణకు విజయసాయి చురకలుచంద్రబాబు తుమ్మిదే అద్భుతం, దగ్గితే అద్భుతం: రాధాకృష్ణకు విజయసాయి చురకలు

Pawan Kalyan will not win even one seat

జగన్‌తో ప్రత్యేక హోదా సాధనా సమితి నేత

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాసరావు తదితరులు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, ఢిల్లీ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. హోదాపై ఇప్పటికే తమ కార్యాచరణను ప్రకటించామన్నారు. త్వరలోనే మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిద్దామన్నారు.

Recommended Video

లంచాలు తీసుకొని రసీదులు ఇవ్వరుగా : పవన్ కళ్యాణ్

కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా అడిగి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని జగన్ వారితో చెప్పారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదని, మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకే అన్నారు. హోదా కోసం పోరాడేవారందరికీ వైసీపీ అండగా ఉంటుందన్నారు. హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. కాగా, అంతకుముందు విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీలో రహస్య సమావేశాలు జరిపారని, ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారో చెప్పాలన్నారు.

English summary
TDP leaders on Wednesday said that Jana Sena chief Pawan Kalyan will not win even one seat in Andhra Pradesh in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X