వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రోజు ఎలా హిట్ చేయాలో పవన్ రేపు చెప్తారేమో: వర్మ సెటైర్, జగన్‌కు ప్రశంస

ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గురువారం నాడు రివర్స్ గేర్ వేశారు. ప్రత్యేక హోదాకు ఉద్యమిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన నిన్న ప్రశంసలు కురిపించిన వర్మ.. ఈ రోజు (శుక్రవారం) విమర్శలు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గురువారం నాడు రివర్స్ గేర్ వేశారు. ప్రత్యేక హోదాకు ఉద్యమిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన నిన్న ప్రశంసలు కురిపించిన వర్మ.. ఈ రోజు (శుక్రవారం) విమర్శలు చేశారు.

విశాఖ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల పైన పవన్ గురించి వరుస ట్వీట్లు చేసిన వర్మ... తాను చాలా నిరాశకు గురయ్యానని చెప్పారు.

ఇంకా దూరంగా ఉండి పవన్ ట్వీట్లు చేస్తున్నాడేమిటని ప్రశ్నించారు. యుద్ధ క్షేత్రంలో ఎప్పుడు దిగుతాడని అడిగారు. ఇలా దూరంగా ఉండి ఫోన్లతో ట్వీట్లు చేయడం, యుద్ధాన్ని మధ్యలో వదిలేయడం వంటిదే అన్నారు.

 Pawan Kalyan will tell some master plan tomorrow how to make supre hit: Varma

రేపు ఉదయం ప్రెస్ మీట్ పెడాతానని పవన్ చెప్పడంపై స్పందించారు. తాను చాలా నిరాశ చెందానని, ఈ రోజు రంగంలోకి దిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఈ కార్యక్రమాన్ని (ఈ రోజు నిరసన కార్యక్రమం) ఎలా హిట్ చేయాలో రేపు పవన్ ప్రెస్ మీట్లో చెబుతారేమోనని ఎద్దేవా చేశారు.

తెలుగు ప్రజలు జల్లికట్టు నుంచి స్ఫూర్తి పొందడమే కాదని, తమిళుల నుంచి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.

బాబుకు రాజమౌళి షాక్: మహేష్ బాబు ద్రోహి..'రియల్' హీరో పవన్ వెంట నడువు: వర్మబాబుకు రాజమౌళి షాక్: మహేష్ బాబు ద్రోహి..'రియల్' హీరో పవన్ వెంట నడువు: వర్మ

జగన్‌కు ప్రశంసలు

వైసిపి అధినేత జగన్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. జగన్ అసలైన నిబద్దతను, అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని పేర్కొన్నారు. విశాఖలో తలపెట్టిన నిరసన ప్రదర్శనకు తనవంతు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన జగన్‌కు హ్యాట్సాప్ అన్నారు.

English summary
Ram Gopal Varma on Thursday said that Pawan Kalyan will tell some master plan tomorrow how to make supre hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X