వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ అవసరంలేదు, నేను చాలు: వేణుమాధవ్, జగన్-రోజాలను తిట్టడంపై

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019లోను తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని ప్రముఖ నటుడు వేణు మాధవ్ చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019లోను తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని ప్రముఖ నటుడు వేణు మాధవ్ చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

చిరంజీవితో విజయసాయి చర్చలు?: జగన్-చంద్రబాబులకు షాకిస్తారా?చిరంజీవితో విజయసాయి చర్చలు?: జగన్-చంద్రబాబులకు షాకిస్తారా?

పవన్ కళ్యాణ్ రారు

పవన్ కళ్యాణ్ రారు

తనకు తెలిసి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని వేణుమాధవ్ చెప్పారు. జనసేన అధినేత తెలుగుదేశం పార్టీకి అండగా ఉండారని అభిప్రాయపడ్డారు. 2019లోు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటారని తెలిపారు. పవన్ మద్దతివ్వకపోయినా 2019లో టిడిపి గెలుస్తుందా అని ప్రశ్నిస్తే వేణు మాధవ్ పైవిధంగా సమాధానం చెప్పారు.

పవన్ లాంటి వాడు అవసరంలేదు, నాలాంటివాడు చాలు

పవన్ లాంటి వాడు అవసరంలేదు, నాలాంటివాడు చాలు

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పవన్ కళ్యాణ్‌కు తెలుసునని, అందుకే ఆయన టిడిపి వెంట ఉంటారని చెప్పారు. సెంటిమెంట్ ఉప ఎన్నిక కాబట్టే నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతివ్వలేదని చెప్పారు. ఇక, కాకినాడలో పవన్ అంతటి వ్యక్తి రావాల్సిన అవసరం లేదన్నారు. నాలాంటి వాడు చాలు అని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్‌పై ఇదీ నా అభిప్రాయం

పవన్ కళ్యాణ్‌పై ఇదీ నా అభిప్రాయం

జనసేన పార్టీకి సొంత దుకాణం ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ తమతో మాట్లాడుతారని, టిడిపితో కలిసి వస్తారని వేణు మాధవ్ చెప్పారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని కూడా వేణు మాధవ్ తెలిపారు.

జగన్, రోజాను తిట్టేందుకు

జగన్, రోజాను తిట్టేందుకు

నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్, రోజాను తిట్టేందుకు టిడిపి నుంచి ఎంత డబ్బు తీసుకున్నారని ప్రశ్నించగా.. వేణు మాధవ్ నవ్వేశారు. తనకు చాలా ఆస్తి ఉందని, అలాంటప్పుడు తనకు డబ్బులతో అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఆ ఆరోపణ ఓ కామెడి అన్నారు.

ఇదీ నా ఆస్తి

ఇదీ నా ఆస్తి

తన వద్ద డబ్బు ఉందని వేణుమాధవ్ చెప్పారు. తనకు మౌలాలీ హౌసింగ్ బోర్డులో పది డబుల్ బెడ్ రూం ప్లాట్లు ఉన్నాయని, జమ్మికుంట మండలం శాయంపేటలో తనకు పది ఎకరాల స్థలం ఉందని, అలాగే, ఫిలిం నగర్‌లో సొంత ప్లాట్ ఉందని చెప్పారు. టిడిపికి డప్పు కొట్టడం లేదని, చంద్రబాబు అంటే తనకు అభిమానమని చెప్పారు.

English summary
Actor Venu Madhav on said that Jana Sena chief and Power Star Pawan Kalyan won't enter active politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X