వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019లో పవన్ టిడిపితోనే: 'టిడిపి నేతలతో పవన్‌కు సత్సంబంధాలు'

2019 ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తమతోనే కలిసి పనిచేస్తారని ఏపీ కాపు కార్పోరేషన్ ఛైర్మెన్ చలమశెట్టి రామానుజయ చెప్పారు.తమకు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని రామానుజయ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు: 2019 ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తమతోనే కలిసి పనిచేస్తారని ఏపీ కాపు కార్పోరేషన్ ఛైర్మెన్ చలమశెట్టి రామానుజయ చెప్పారు.తమకు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని రామానుజయ చెప్పారు.

2014 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ జనసేన తరపున బిజెపి టిడిపి కూటమికి మద్దతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీల అభ్యర్థుల విజయంలో పవన్ పాత్ర ఉంది.

2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ప్రకటించారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన ఇప్పటి నుండే రంగం సిద్దం చేసుకొంటుంది. జనసేనలో పనిచేసేందుకు క్యాడర్ ‌ ఎంపిక కూడ పూర్తి చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్‌లోనే జనసేన సభ్యత్వాల ప్రక్రియ చేపట్టింది. 2019 ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేస్తామనే విషయమై పవన్ కళ్యాణ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

2019 ఎన్నికల్లో టిడిపితోనే పవన్‌కళ్యాణ్

2019 ఎన్నికల్లో టిడిపితోనే పవన్‌కళ్యాణ్

జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌కు, టీడీపీ నేతలకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని కాపు కార్పోరేషన్ ఛైర్మెన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. 2019 ఎన్నికల్లోపవన్ కళ్యాణ్ టీడీపీతో కలసి పనిచేస్తారన్న ఆశాభావం తమకు ఉందన్నారు. ఈ విషయంలో ఎవరు కూడ భయపడాల్సిన అవసరం లేదన్నారు రామానుజయ.

పవన్ టిడిపికి మద్దతిస్తారా?

పవన్ టిడిపికి మద్దతిస్తారా?

2019 ఎన్నికల్లో పవన్ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో వామపక్షాలతో కలిసి పవన్ పోటీచేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేర్వేరుగా పవన్ కళ్యాణ్‌లతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయపరిస్థితులకు అనుగుణంగా కూటములు ఏర్పాటు చేసి పోటీకి దిగాలని వామపక్షాలు భావిస్తున్నాయి. వామపక్షాలతో కలిసి పోటీకి పవన్ సన్నద్దంగా ఉన్నారనే సమాచారం. అయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో...అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు తమ వ్యూహలను మార్చుకొనే అవకాశం లేకపోలేదు.

నంద్యాల ఎన్నికల్లో తటస్థంగా జనసేన

నంద్యాల ఎన్నికల్లో తటస్థంగా జనసేన


నంద్యాల ఉపఎన్నికల సమయంలో టిడిపికి జనసేన మద్దతిస్తోందని భావించారు. అయితే పోలింగ్ సమయం దగ్గరపడే సమయంలో పవన్ కళ్యాణ్ తమ పార్టీ వైఖరిని తేల్చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వమని, తటస్థంగా ఉంటామని ప్రకటించారు. నంద్యాల ఉప ఎన్నికల కంటే ముందు ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ ఆందోళనలు నిర్వహించారు. అంతేకాదు ప్రత్యేక హోదా విషయంలో టిడిపి నేతలపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి మద్దతిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని భావించి తటస్థ వైఖరిని తీసుకొన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

కాపులను బీసీల్లో చేర్చడం ఖాయం

కాపులను బీసీల్లో చేర్చడం ఖాయం

కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని కాపు కార్పోరేషన్ ఛైర్మెన్ రామానుజయ చెప్పారు. ఈ విషయంలో ఎవరూ ఆవేదన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్‌ ద్వారా లక్షా 50 వేల మందికి రుణాలు ఇచ్చామని, గ్రూప్స్‌ పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న 1250 మందికి తమ కార్పొరేషన్‌ ద్వారా ఖర్చుపెట్టామన్నారు. రాష్ట్రంలో సుమారు 60 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

English summary
Kapu corporation chairman Ramanujaya said that in 2019 elections janasena chief Pawankalyan will work with TDP.He spoke to media at Dwaraka Tirumala on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X