తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇచ్చిన పవన్ సతీమణి అన్నా కొణిదెల
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదెల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమె తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి తలనీలాలను సమర్పించారు. తొలుత శ్రీ వరాహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు అన్నా కొణిదెల. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తరవాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు.

రేపు ఉదయం పవన్ కల్యాణ్ తో కలిసి ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమె తిరుమల శ్రీవారికి మొక్కు చెల్లించుకోనున్నారు. ఇవాళ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అన్నా లెజినోవా, తిరుమలకు చేరుకుని డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేశారు. అన్నా మతపరంగా క్రిస్టియన్ కావడంతో వేరే మతం వాళ్లు తిరుమలకు వెళితే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అన్నా కొణిదెల గాయత్రి సదనం లో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాల పైన సంతకం చేశారు.
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.
అనంతరం సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స చేశారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో పవన్ వెంట హైదరాబాద్ వచ్చాడు మార్క్ శంకర్.












Click it and Unblock the Notifications