గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు ప్రత్యేకతలు ఇవే! భార్యతో కలిసి ఇలా.. (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు ప్రత్యేకతలు ఇవే!

ఒగుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కాజలో సొంత ఇంటితో పాటు వ్యక్తిగత కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. తన సతీమణితో కలిసి ఆయన పూజ చేశారు.

చదవండి: బాబు వల్లే కియా వచ్చిందని గొప్పలు, భయపడ్డారు: మాణిక్యాల రావు తీవ్రవ్యాఖ్యలు

మురగన్‌ హోటల్‌ రోడ్డులోని సాహితీ వెంచర్‌లో ఇంటిని నిర్మించనున్నారు. ఇందుకోసం కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకుని ఓ ప్రయివేటు హోటల్‌లో బస చేశారు. అత్యంత సన్నిహితులు, పార్టీ ముఖ్య నాయకులకు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది.

చదవండి: రైల్వే జోన్ ఇవ్వలేం, ఏపీకి మరో షాక్: చేతలెత్తేసిన కేంద్రం, పుండు మీద కారం

ఇంటితో పాటు వ్యక్తిగత కార్యాలయం

ఇంటితో పాటు వ్యక్తిగత కార్యాలయం

ఇంటితో పాటు వ్యక్తిగత కార్యాలయం ఇందులో ఉండనుంది. భవిష్యత్తులో దీన్ని పార్టీ కార్యాలయంగానూ వినియోగించుకునే అవకాశముందని అంటున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో 14న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఏర్పాట్లను పరిశీలించారు.

ఇంటి ప్రత్యేకతలు, 8 అడుగుల గోడ, 60 శాతం పార్కింగ్

ఇంటి ప్రత్యేకతలు, 8 అడుగుల గోడ, 60 శాతం పార్కింగ్

కాగా, పవన్ సొంతిల్లు ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. చుట్టూ 8 అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణంగా ఉండే ఈ భవనంలో 60 శాతం స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచి పెట్టనున్నారని సమాచారం.

మూడు అంతస్తులు ఇలా

మూడు అంతస్తులు ఇలా

మొత్తం మూడు అంతస్తుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో సమావేశపు మందిరంతో పాటు అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు గదులు, శాశ్వత పని వారి కోసం నివాసం గదులు ఉంటాయని తెలుస్తోంది.

మిగతా ఫ్లోర్‌లలో ఇలా

మిగతా ఫ్లోర్‌లలో ఇలా

ఆ తర్వాత ఫ్లోర్‌లో మరో చిన్న సమావేశపు మందిరంతో పాటు వంటగది, డైనింగ్ హాల్, బెడ్రూంలు తదితరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. తర్వాత అంతస్తులో రెండు లేదా మూడు గదులను మాత్రమే నిర్మించి మిగతా స్థలాన్ని ఖాళీగానే ఉంచాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

కాకినాడ ఘటనలు ఇక్కడ జరగొద్దు

కాకినాడ ఘటనలు ఇక్కడ జరగొద్దు

కాజ వచ్చిన పవన్ సభా వేదిక ఏర్పాట్ల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. సభావేదిక ఎక్కి ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతపురం, కాకినాడ సభ అనంతరం జరిగిన అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ పునరావృతం కానివ్వొద్దని నేతలకు సూచించారు.

సౌకర్యాలపై పవన్ కళ్యాణ్ ఆరా

సౌకర్యాలపై పవన్ కళ్యాణ్ ఆరా

సభకు వచ్చే కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రణాళికలు

ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రణాళికలు

కాగా, మార్చి 14న నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండేందుకు వచ్చానని చెప్పారు. ఆయన ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

వీడియోలో 49 మంది మహనీయుల చిత్రాలు

వీడియోలో 49 మంది మహనీయుల చిత్రాలు

జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభను పురస్కరించుకుని 'మన మహనీయులు స్ఫూర్తి ప్రదాతలు... అందుకోండి మా ప్రణామాలు' అంటూ రూపొందించిన వీడియోను జనసేన ఆదివారం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 49 మంది మహనీయుల చిత్రాలను ఈ వీడియోలో పొందుపరిచారు.

పలువురు ప్రముఖులు

పలువురు ప్రముఖులు

గౌతు లచ్చన్న, గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు, అల్లూరి సీతారామరాజు, శ్రీశ్రీ, సర్‌ ఆర్ధర్‌ కాటన్‌, డొక్కా సీతమ్మ, డా యల్లప్రగడ సుబ్బారావు, భోగరాజు పట్టాభిసీతారామయ్య, పింగళి వెంకయ్య, విశ్వనాథ సత్యనారాయణ, రఘుపతి వెంకటరత్నంనాయుడు, గుర్రం జాషువ, ఎన్‌జీరంగా, పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాలరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, శంకరంబాడి సుందరాచారి, జిడ్డు కృష్ణమూర్తి, సీపీ బ్రౌన్‌, దామోదరం సంజీవయ్య, టంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు, సరోజినీ నాయుడు, స్వామి రామానంద తీర్థ, కొమురం భీం, దాశరధి, కాళోజీ, పీవీ నరసింహరావు, సుద్దాల హనుమంతు తదితరుల చిత్రాలు ఉన్నాయి.

English summary
Jana Sena president and popular actor Pawan Kalyan said here on Monday that he would make a key announcement at a public meeting to be held on March 14 at the Bible Mission Grounds near Acharya Nagarjuna University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X