ఇంజనీరింగ్ విద్యార్థులతో జనసేనాని : నేడు గేట్స్ కాలేజీలో పవన్ ఇష్టాగోష్టి..
అనంతపురం : మొత్తానికి నిన్నటి అనంత సభ ద్వారా.. తన చట్టసభల ఎంట్రీ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. పోటీ ఎక్కడినుంచైనా చేయొచ్చు గానీ.. ఎమ్మెల్యేగా పోటీ చేయడం మాత్రం పక్కా.. అని తేల్చేశారు. అందుకోసం ఇప్పటినుంచే పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయబోతున్నట్టుగా స్పష్టం చేశారు పవన్.
ఈవిధంగా అనంతపురంను తన కీలక రాజకీయ అడుగులకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన తొలి రాష్ట్ర కార్యాలయాన్ని అనంతపురంలోనే ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటినుంచి పవన్ వేసే ప్రతీ అడుగును అన్ని వర్గాలు నిశితంగా గమనించబోతున్నాయి.

నేడు ఇంజనీరింగ్ విద్యార్థులతో భేటీ :
గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులతో నేడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముచ్చటించననున్నారు. గుత్తి పట్టణంలో గల గుత్తి పట్టణంలోగల గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఉదయం 10 గంటలకు ఈ ఇష్టాగోష్టి ప్రారంభం కానుంది. సమావేశంలో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు.. ప్రత్యేక హోదాపై విద్యార్థులకు పవన్ సూచనలు చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications