పవన్ కల్యాణ్ ఎవరికీ అర్థం కారా?: చిరంజీవి మౌనం
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి స్పందించలేదు. ఇది చర్చనీయాంశమవుతోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు సోదరుడు పవన్ కల్యాణ్ జోరుగా ప్రచారం చేశారు. పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసినప్పటి నుండి పవన్ అసంతృప్తితో ఉన్నారనే వాదన ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా గత ఆదివారం పవన్ రాజకీయ నాయకుల పైన విమర్శలు చేయడం, ఆ తర్వాత తన రాజకీయ ప్రకటన పైన పవన్ మార్చి రెండోవారంలో ప్రకటన చేస్తారనే నోట్ వెలువడటం ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ, లోక్ సత్తా, టిడిపి, బిజెపిలలోకి వెళ్తారని, కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దీనిపై చిరంజీవి స్పందించలేదు. అయితే, చిరు సన్నిహితుడు ఒకరు ఆంగ్ల మీడియా అడిగినప్పుడు మాత్రం స్పందించారట. పవన్ కల్యాణ్‌ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, పవర్ స్టార్ రాజకీయాల పైన తన మనసులోని మాటను బయట పెట్టే వరకు ఆయన రాజకీయ నిర్ణయం పైన చెప్పలేమని స్పష్టం చేశారట.
కాగా, పవన్ కల్యాణ్ రాజకీయాల పైన ఎలాంటి మీడియా సమావేశం పెట్టడం లేదని బుధవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో చేరుతారనే ప్రచారం ఆగలేదు.












Click it and Unblock the Notifications