వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌వి టైంపాస్ రాజకీయాలు, ఉండవల్లి రిటైర్డ్ టీచర్, జెపి విఫలనేత: కత్తి మహేష్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan, Undavalli and JP Combo : Kathi Mahesh cheap comments

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై రాజకీయ విశ్లేషకులు కత్తి మహేష్ మరోసారి ధ్వజమెత్తారు. టైమ్ పాస్ రాజకీయాలు మానుకోవాలని పవన్ కళ్యాణ్‌కు కత్తి మహేష్ సూచించారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఢిల్లీలో ఆంధోళనకు సిద్దమైతే మేమంతా మీ వెంట ఉంటామని కత్తి మహేష్ పవన్‌కళ్యాణ్‌కు తేల్చి చెప్పారు

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని ఎంపీలు ఆందోళన చేశారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టిడిపి కూడ బిజెపి తీరుపై గుర్రుగా ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని టిడిపి నేతలు బిజెపిని నిలదీస్తున్నారు.

ఈ తరుణంలో జెఎసి ఏర్పాటు చేయాలని జనసేన చీప్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. లో‌క్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పవన్ కళ్యాణ్ చర్చించారు.మరో వైపు ఏపీకి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చారనే విషయమై లెక్కలు ఇవ్వాలని టిడిపి, బిజెపి నేతలను పవన్ కళ్యాణ్ కోరడాన్ని విమర్శకులు కత్తి మహేష్ తప్పుబట్టారు.ఈ మేరకు తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకొన్నారు. ఓ వీడియోను పోస్ట్ చేశారు కత్తి మహేష్.

టైమ్‌పాస్ రాజకీయాలు మానుకోవాలి

టైమ్‌పాస్ రాజకీయాలు మానుకోవాలి

ఏపీకి నిధులిచ్చామని బిజెపి, ఇవ్వలేదని టిడిపి నేతలు చెబుతున్నారని రాజకీయవిశ్లేషకులు కత్తి మహేష్ గుర్తు చేశారు.ఏపీకి ఏ మేరకు నిధులు ఇచ్చారనే విషయమై పబ్లిక్ డొమైన్‌లో చూసుకోవాలని ఇప్పటికే టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పిన విషయాన్ని కత్తి మహేష్ గుర్తు చేస్తున్నారు.జెఎసి ఏర్పాటు విషయమై తాను స్వాగతించానని ఆయన చెప్పారు. కానీ, నిధులు ఎన్ని ఇచ్చారు, ఎన్ని నిదులను ఇంకా రావాల్సి ఉందనే విషయమై తీరిగ్గా లెక్కలు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని కత్తి మహేష్ ప్రశ్నించారు. దీని వల్ల సమయం వృధా అవుతోందని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. టైమ్ పాస్ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ పూనుకొన్నారనే అభిప్రాయాన్ని కత్తి మహేష్ వ్యక్తం చేశారు.

వర్మకు అదే ధ్యాస, సహకరించాలి: శివప్రసాద్, బహిరంగ చర్చకు సిద్దమేనా?:బిజెపివర్మకు అదే ధ్యాస, సహకరించాలి: శివప్రసాద్, బహిరంగ చర్చకు సిద్దమేనా?:బిజెపి

ఢిల్లీలో ధర్నా చేయండి మేమొస్తాం

ఢిల్లీలో ధర్నా చేయండి మేమొస్తాం

ఏపీ రాష్ట్రానికి కేంద్రం గతంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తే తామంతా మీ వెంట నడుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు రాజకీయ విశ్లేషకులు కత్తి మహేష్ సూచించారు. ఎన్నికల ముందు , ఎన్నికల తర్వాత ఇచ్చిన హమీలు ఏ మేరకు నెరవేరాయో అందరికీ తెలుసునన్నారు. కనీసం ఈ హమీలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు నిర్వహిస్తే ప్రజలు మీ వెంట ముందుకు వస్తారని కత్తి మహేష్ సూచించారు.

బాబు ఉండగా జెఎసి ఎందుకు, కేంద్రం మాటలను నమ్మేది లేదు: కేశినేని సంచలనం బాబు ఉండగా జెఎసి ఎందుకు, కేంద్రం మాటలను నమ్మేది లేదు: కేశినేని సంచలనం

రిటైర్డ్ టీచర్, అమాయకపు స్టూడెంట్

రిటైర్డ్ టీచర్, అమాయకపు స్టూడెంట్

ఏపీకి కేంద్రం నుండి వచ్చిన నిధులు, కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల విషయాన్ని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి అందిస్తే వాస్తవాలు ఏమిటో తేలుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని రాజకీయ విశ్లేషకులు కత్తి మహేష్ తప్పుబట్టారు. ఈ వివరాల కోసం ఆర్‌టిఐ కింద ధరఖాస్తు చేసినా ప్రయోజనం ఉంటుందన్నారు.ఈ కమిటీ ఏర్పాటు వల్ల కాలయాపన అవుతోందన్నారు. ఈ కమిటీ వల్ల ఏపీ ప్రజలకు ఏం ఉపయోగం ఉండదని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. రిటైర్డ్ టీచర్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ ను , అమాయకపు స్టూడెంట్‌గా పవన్ కళ్యాణ్‌ను కత్తి మహేష్ పోల్చాడు.

ఉద్యమాలకు జెపి పనికిరాడు

ఉద్యమాలకు జెపి పనికిరాడు

జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లో ఫెయిలయ్యారని రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ అబిప్రాయపడ్డారు. గతంలో అధికారిగా పనిచేసిన జయప్రకాష్ నారాయణ సలహలు, సంప్రదింపుల కోసం మాత్రమే పనికొస్తారని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. కానీ ఉద్యమాలకు జయప్రకాష్ నారాయణ పనికిరాడని కత్తి మహేష్ తేల్చి చెప్పారు.

English summary
Kathi Mahesh said Jana Sena Chief Pawan Kalyan wants to form a Joint Action Committee with former MP Vundavalli Arun Kumar, Lok Satta Party founder Jayaprakash Narayan and others as he has no basic knowledge about bifurcation issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X