వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌ ప్రశ్నలు:పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు సమాధానాలు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి:పాలకొల్లు నియోజకవర్గంకు సంబంధించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభలో అడిగిన మూడు సమస్యలు ఇప్పటికే పరిష్కార దిశలో ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు చెప్పారు.

పశ్చిమ గోదావరి పర్యటన సందర్భంగా శనివారం పాలకొల్లు సభలో ఎమ్మెల్యే రామానాయుడును ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలను సంధించారు. చంద్రబాబు, లోకేష్‌తో మంచి సంబంధాలు ఉన్నా యడ్లబజారులోని డంపింగ్‌ యార్డును ఎందుకు తరలించలేదని...జనాభా పెరుగుతున్నా మూడవ మంచినీటి చెరువును ఎందుకు తవ్వించలేదని...50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఎందుకు మార్చలేక పోయారని పవన్‌ ప్రశ్నించారు.

 Pawan questions: MLA Dr. Nimmla Ramanaidu Answers

పాలకొల్లులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయంలో డాక్టర్‌ నిమ్మల రామానాయుడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి పవన్ ప్రశ్నలకు బదులు ఇచ్చారు.
పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ఆ మేరకు ప్రతిపాదనలు పంపించామని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు.

ఇక తాగునీటి విషయానికొస్తే రూ.15 కోట్లతో ఫిల్టర్‌లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించుకుంటే తెలుస్తుందన్నారు. యడ్ల బజారులోని డంపింగ్ యార్డ్ తరలింపు గురించి పవన్ ప్రశ్నించారని కానీ రామయ్య హాలు వద్ద అధికారికంగా డంపింగ్‌ యార్డు ఉందని, హిందూ శ్మశాన వాటిక వద్ద మరో అనధికార డంపింగ్‌ యార్డు ఉందని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు.

Recommended Video

క్వారీ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

అంతేకాకుండా ఇటీవల పాలకొల్లు విచ్చేసిన మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ పాలకొల్లులో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారని చెప్పారు. అందుకోసం కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. ఇక తెలుగు దేశం పార్టీ నేతలు క్షీరరామలింగేశ్వరస్వామి భూములు 70 ఎకరాలు కబ్జా చేశారని పవన్‌ ఆరోపించడం తగదని, ఆ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.

English summary
West Godavari:Palakollu MLA Dr Nimmala Ramanaidu said that three issues which were raised by Pawan Kalyan are already in the way of solution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X