వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటా నాదం చేసిన పవన్ కళ్యాణ్... కరోనాపై పోరాటం చేసే వారికి సెల్యూట్ అంటూ ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్పందించారు దేశ వ్యాప్తంగా స్వచ్చందంగా ప్రజలు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇక జనతా కర్ఫ్యూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోడీ నిర్ణయానికి మద్దతునిచ్చి కరోనా వైరస్ వ్యాప్తి చేద్నకుండా పోరాటం సాగించాలని చెప్పారు. ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహనా కార్యక్రమాలు చెయ్యాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. ఇక ఈ క్రమంలో ఈ రోజు ఉదయం నుండి గృహ నిర్బంధంలోనే ఉన్న పవన్ కళ్యాణ్ సాయంత్రం 5 గంటలకు గంటా నాదం చేశారు .

జనతా కర్ఫ్యూ సందర్భంగా సామాజిక దూరం పాటించాలన్న పవన్

జనతా కర్ఫ్యూ సందర్భంగా సామాజిక దూరం పాటించాలన్న పవన్

ఈ రోజు ఉదయం నుండి జనతా కర్ఫ్యూ పాటిస్తున్న నేపధ్యంలో ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి , అందరం ఐక్యంగా పోరాటం సాగిస్తున్న తరుణంలో ఒకరి నుండి మరొకరికి చైన్ లా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టటానికి దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ఆయన కోరారు. సామాజిక దూరం , మరియు స్వీయ నిర్బంధం విధించుకుని ఈ మహమ్మారి నుండి విముక్తి పొందాలని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

హైదరాబాద్ లో తన నివాసంలో గంట మోగించిన పవన్ కళ్యాణ్

ఇక నేడు మార్చి 22వ తేదీ సాయంత్రం 5గం.కు పవన్ కళ్యాణ్ గంటా నాదం చేశారు . ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకి మద్దతుగా హైదరాబాద్ లోని తన నివాసంలో గంట మో గించారు . ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ లో పాల్గొని ఈ కర్ఫ్యూ ని సక్సెస్ చెయ్యటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హర్షం వ్యక్తం చేసిన ఆయన కరోనాపై అందరం ఐక్యంగా పోరాటం సాగించాలని, సామాజిక దూఅరం పాటిస్తూ తరిమి కొట్టాలని కోరుతున్నారు.

కరోనాపై పోరాటం సాగిస్తున్న వారికి సెల్యూట్

కరోనాపై పోరాటం సాగిస్తున్న వారికి సెల్యూట్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్యులకు , నర్సులకు , హెల్త్ వర్కర్స్ కు, శానిటరీ సిబ్బందికి ,మీడియాకు, మరియు పోలీసులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా పై పోరాడుతున్న వీరందరికీ సెల్యూట్ అంటూ గంటా నాదం చేశారు . ఇక దేశ వ్యాప్తంగా ప్రధాని నిర్ణయానికి సంఘీభావంగా కరతాళ ధ్వనులు ద్వారా కృతజ్ఞతలు చెప్పారు ప్రజలు . ఇక తాను లైవ్ లో మాట్లాడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగా లేని కారణంగా లైవ్ ఇవ్వలేకపోయానని పేర్కొన్నారు.

English summary
Janasena President Pawan Kalyan thanked the doctors, nurses, health workers, sanitary staff, media and police for serving the victims. All those who are fighting against Corona . He expressed his gratitude by ringing the bell. The people throughout the country thanked the Prime Minister's decision with claps . Pawan Kalyan said he would not speak live because internet signals were poor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X