• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రూటు మార్చుతున్న పవన్ కల్యాణ్? జనసేనలో మొదలైన టెన్షన్ .. ఎందుకంటే

|

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారా? గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలపై దృష్టి సారిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తానని,చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని,సినిమాలు చేయనని చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్ సడన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

సినిమాల విషయంలో జనసేనాని యూటర్న్

సినిమాల విషయంలో జనసేనాని యూటర్న్

సినీస్టార్ నుండి నుండి రాజకీయ నాయకుడిగా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, గత ఎన్నికల్లో ఏపీలో పోటీచేసి కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన నేపథ్యంలో ఇక ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తారు అని అందరూ భావించారు. ఏకంగా భీమవరం, గాజువాక రెండు స్థానాల నుండి పోటీ చేసిన ఆయన సైతం ఓటమి చెందారు. కానీ ఊపిరి ఉన్నంతవరకు జనసేన పార్టీని ముందుకు నడిపిస్తానని,రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు పవన్ కళ్యాణ్.ఇక పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ జనసేన వర్గాల్లో కాస్త జోష్ నింపుతున్నారు. ఇక ఇదే సమయంలో ఇక సినిమాలు చేయనని చెప్పిన ఆయన ఇప్పుడు ఓ రీమేక్ సినిమాలో కనిపించబోతున్నారు.

పింక్ హిందీ రీ మేక్ చిత్రంలో పవన్ కళ్యాణ్

పింక్ హిందీ రీ మేక్ చిత్రంలో పవన్ కళ్యాణ్

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా చేయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పింక్ అనే హిందీ రీమేక్ చిత్రంలో అమితాబచ్చన్ పాత్రలో పవన్కళ్యాణ్ నటించనున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జనవరి 2020 నుండి ప్రారంభం అవుతుంది. ఇక అంతే కాదు వచ్చే మూడేళ్లలో ప్రతి సంవత్సరం ఒక చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించనున్నారని తెలుస్తోంది.

పవన్ అభిమానులకు మోదం ... జనసేన నాయకుల్లో ఖేదం

పవన్ అభిమానులకు మోదం ... జనసేన నాయకుల్లో ఖేదం

పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నాడు అన్న వార్త పవన్ అభిమానులకు సంతోషం కలిగించినా, జనసేన పార్టీ నేతలకు మాత్రం రుచించడం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకూ పెద్దగా సినిమాల్లో నటించకపోయినా పార్టీ బలోపేతం అయినది కానీ, పార్టీ సాధించిన విజయాలు కానీ ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఫెయిలయ్యారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జగన్ పరిపాలన తీరుపై విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితమయ్యారు తప్ప పార్టీ నుండి వలసలను ఆపలేకపోతున్నారు. అలాగే పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు.

పవన్ సినిమాల్లో నటిస్తే జనసేన పరిస్థితి ఏంటి అన్న చర్చ

పవన్ సినిమాల్లో నటిస్తే జనసేన పరిస్థితి ఏంటి అన్న చర్చ

ఇక ఈ సమయంలో ఆయన మళ్లీ సినిమాల్లో నటిస్తారు అంటే పార్టీ కార్యకలాపాలపై పెద్దగా దృష్టి పెట్టరని జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే జనసేన పార్టీ పై విశ్వాసం కోల్పోయిన చాలామంది నాయకులు పార్టీని వీడి వలసల బాట పడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తారు అంటే పార్టీ పరిస్థితి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. అటు సినిమాలను,ఇటు రాజకీయాలను రెంటిని బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన ను ముందుకు నడిపించడం కష్టమే అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక ఇదే సమయంలో అన్న చిరంజీవి తరహాలో నిదానంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతారా అన్న అనుమానం సైతం చాలామందికి కలుగుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor-turned-politician Pawan Kalyan has finally agreed to do a movie under the banner of Mythri Movie Makers. He will be playing the role of Amitabh Bachchan in remake Hindi film called Pink. The flick will be directed by Harish Shankar and regular shooting will begin from January 2020. Pawan Kalyan took a decision to act in the movie as elections are going to be held after 4 years. According to sources, he will act in one film every year in the next three years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more