వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ఓటమితో జనసేనలో హైరానా..! గబ్బర్ సింగ్ ను ఓడించిన అభ్యర్థికి మాత్రం నజరానా..!!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి ఆ పార్టీలో నైరాశ్యం నింపినా ప్రత్యర్థి పార్టీలో మాత్రం జోష్ ని నింపుతోంది. పవన్ కళ్యాణ్ అంతటి పజాకర్శణ ఉన్న నాయకుడిని ఓడించడం సామాన్య విషయం కాదనే చర్చ కూడా అదికార పార్టీ లో నడుస్తోంది. అందుకు పవన్ మీద గెలిచిన అభ్యర్ధికి మంచి నజరానా ఇవ్వాలని కూడా వైసీపి అదిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. గాజువాకలో గబ్బర్ సింగ్ ను ఓడించిన వైసీపి అభ్యర్ధి నాగి రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించే దిశగా పార్టీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలుసా ?జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలుసా ?

జనసేనకు ఊహించని దెబ్బ..! గాజువాకలో ప్రభావం చూపని గబ్బర్ సింగ్..!!

జనసేనకు ఊహించని దెబ్బ..! గాజువాకలో ప్రభావం చూపని గబ్బర్ సింగ్..!!

పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓటమి అలా ఇలా కాదట, భారీ ఆధిక్యతతోనే వెనకబడిపోయి ఓటమి పాలు అయ్యారని తెలుస్తోంది. అతి పెద్ద నియోజకవర్గమైన గాజువాకలో కౌంటింగ్ కూడా బాగా లేట్ అయింది. అర్ధరాత్రి 12 గంటలకు ఇంకా ఆరు వేల ఓట్లు మిగిలి ఉండగానే వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించినట్లుగా లెక్క తేల్చారు. అప్పటికి నాగిరెడ్డికి 17 వేల పై చిలుకు ఆధిక్యత పవన్ మీద లభించింది.

సత్తా చాటిన వైసీపి..! ఎదురులేని నాగిరెడ్డి..!!

సత్తా చాటిన వైసీపి..! ఎదురులేని నాగిరెడ్డి..!!

ఇంకా ఏడు ఈవీఎంలలో కౌంటింగ్ చేయాల్సివుంది. అయితే భారీ మెజారిటీ రావడం, ఆ ఆరువేలు కలిపినా కూడా గెలుపు అంచులకు అటు జనసేన ఇటు టీడీపీ చేరుకోలేవని డిసైడ్ అయి కౌంటింగ్ ఏజెంట్లు కూడా వెళ్ళిపోయారుట. కాగా తాజాగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఆ ఏడు ఈవీఎంలను కూడా లెక్క కడితే మాత్రం అందులో కూడా సగానికి పైగా ఓట్లు నాగిరెడ్డికి కచ్చితంగా వచ్చేవని అపుడు ఆయన మెజారిటీ 20 వేలకు పై చిలుకు ఉండేదని అంటున్నారు.

కాలిసిరాని కాపుల లెక్క..! పవన్ ను పక్కన పెట్టిన కాపులు.!!

కాలిసిరాని కాపుల లెక్క..! పవన్ ను పక్కన పెట్టిన కాపులు.!!

ఈ లెక్క ఇపుడు ఎందుకు తీస్తున్నారంటే ఇందుకు కూడా వేరే కారణం ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి సినిమా స్టార్ ని ఓడించడం అంటే తమాషా కాదు, అదీ అయన సొంత కులం, బలం దండీగా ఉన్న చోట, ఫ్యాన్స్ భారీగా ఉన్న గాజువాకలో ఓడించి పంపించడం అంటే అది కచ్చితంగా నాగిరెడ్డి గొప్పతనం అని అంటున్నారు. ఇక నాగిరెడ్డి కూడా మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగానే భారీ మెజారిటీ తెచ్చుకున్నారని, పైగా అర్బన్ జిల్లాలో రెండు సీట్లు గెలిస్తే అందులో భీమిలీ ఎమ్మెల్యే అవంతి మెజారిటీ కేవలం పదివేలు మాత్రమేనని గుర్తు చేస్తున్నారు.

నాగిరెడ్డికి మంత్రి పదవి..! పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ..!!

నాగిరెడ్డికి మంత్రి పదవి..! పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ..!!

నాగిరెడ్డికి మిగిలిన ఏడు ఈవీఎంలు కలిపితే 20 వేల పై చిలుకు మెజారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు. అందువల్ల ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కూడా డిమాండ్ చేస్తున్నారు. రేపటి రోజున అర్బన్ జిల్లాలో వైసీపీ బలపడాలన్నా, జీవీఎంసీ ఎన్నికల్లో జెండా ఎగరేయాలన్నా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం అవసరమని వాదిస్తున్నారు. పైగా మొదటి నుంచి వైఎస్సార్, జగన్ వెంట ఉన్న నిబద్ధత కలిగిన నేత నాగిరెడ్డి అని కూడా అంటున్నారు . మరి సీయం జగన్ ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా అందలం ఎక్కిస్తారో చూడాలి..!!

English summary
The YCP seems to Give a good chance to the candidate who defeated Janasena chief Pawan Kalyan. Nagi Reddy, who lost to Gabbar Singh in Gajuwaka, has been informed that the party is moving towards giving hima a proper place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X