వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై పవన్‌ ట్వీట్లు ముమ్మాటికీ నిజం:సిపిఎం మధు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయ‌వాడ :ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు నూటికి నూరుపాళ్లు నిజమని సిపిఎం నేత మధు వ్యాఖ్యానించారు. విభజన హామీల నెరవేర్పు కోసం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షపై స్పందించి మీడియాతో మాట్లాడు సిపిఎం మధు ఈ వ్యాఖ్యలు చేశారు.

గత నాలుగేళ్లుగా సిఎం చంద్రబాబు ప్రత్యేక హోదా పోరాటాలను నీరుగార్చారని, హోదా పేరు ఎత్తిన వారిపై పీడీ యాక్టులతో బెదిరింపులకు ప్పాడ్డారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం చేస్తోంది అసలు దీక్ష కాదని దొంగ జపం...దొంగ దీక్ష అని సీపీఎం నాయకుడు మధు విమర్శించారు.

Pawans Tweets on Chandrababu is 100 % true:CPM Madhu

ఈ నెల 16న ప్రత్యేక హోదాకు మద్దతుగా బంద్‌కు పిలుపునిస్తే...బంద్‌లు ప్రజలను ఇబ్బందులు గురిచేస్తాయి తప్ప, హోదా వస్తుందా అని చంద్రబాబు అన్నాని మధు గుర్తు చేశారు. అలాగే గతంలో ప్రత్యేక హోదా వద్దన్న ఆయనే ఇప్పుడు హోదా కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంపై అవిశ్వాసం అవసరం లేదంటూనే అవిశ్వాసం పెడతారని మధు విమర్శించారు.

చంద్రబాబు చేస్తున్న ఈ ధర్మ పోరాట దీక్షకు టీడీపీ కార్యకర్తలదే తప్ప ప్రజల మద్దతు లేదని సిపిఎం మధు తేల్చేశారు. ప్రత్యే హోదాపై తమ పార్టీ తరుపున తీర్మానం ఉంటుందన్నారు. ఈనెల 24 తేదీన హోదా సాధనకోసం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని, అంతేకాకుండా ఆ రోజు బ్లాక్‌డే కూడా పాటించడం జరుగుతుందని మధు తెలిపారు.

English summary
Vijayawada:CPM Leader Madhu reacted on Pawan Kalyan's comments against the Andhra Pradesh chief minister. He said that every word of Pawan kalyan tweets on Chandrababu was true. Madhu also slammed Chandrababu, terming the TDP chief's hunger strike a drama, Chandrababu had watered down the fight for Special Catrgory Status over the last four years of his party's tie-up with the ruling BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X