వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మకు నమ్మకు ఈ రేయిని...అంటూ పవన్ ట్విట్టర్ పోస్ట్: ఇసుక పాలసీపై చురకలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటివల తీసుకువచ్చిన ఇసుక పాలసీపై జనసేన అధినేత నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో విశాఖలో లాంగ్‌మార్చ్ చేపట్టిన ఆయన సమస్యనను తీర్చేందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చారు. అయితే పవన్‌పై వైసీపీ నేతలు అదే స్థాయిలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. గత రెండు రోజులుగా ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇసుక కొరతపై పవన్ విభిన్న విమర్శ

ఇసుక కొరతపై పవన్ విభిన్న విమర్శ

దీంతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శల దాడిని మరింత పెంచారు. అయితే ఈ సారి ప్రభుత్వంపై వెరైటీ స్టైల్లో విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజల ఆవేదనను ఓ సినిమా పాట రూపంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అది కూడ తన సోదరుడు చిరంజీవి నటించి, జాతీయ స్థాయి అవార్డును అందుకున్న రుద్రవీణ సినిమాలోని సందేశాత్మకమైన పాటను ట్విట్టర్‌లో పోస్టు చేసి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ ఇసుక విధానం వల్ల భవననిర్మాణ కార్మికులు సరైన ఉపాధిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అయితే నెలవారి జీతాలు, ఇతర సౌకర్యాలు పోందుతున్నారని అలాంటీ నేతలకు ఈ పాట కనువిప్పు కల్గిస్తుందని పేర్కోన్నారు.

రుద్రవీణలోని పాట పోస్ట్ చేసిన పవన్

కాగా పాటకు సంబంధించిన వివరాలను కూడ ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నమ్మకు నమ్మకు ఈ రేయిని అంటూ సాగిన పాటతో పాటు అదే సినిమాలోని, నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది... రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా...తెప్ప తగలబెట్టేస్తావా యేరు దాటగానే...అంటూ మరోపాటను పోస్ట్ చేశారు.

సినిమా నేపథ్యం వివరించిన పవన్

ఇక పాటతో పాటు సినిమాకు నిర్మాణానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడ పవన్ వివరించారు. రుద్రవీణ సినిమా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను స్ఫూర్తిగా తీసుకుని సినిమాను నిర్మించారని, సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిందని పేర్కోన్నారు . కె.బాలచందర్ దర్శకత్వం వహించిన రుద్రవీణ సినిమాను మెగాబ్రదర్ నాగబాబు నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించినట్టు చెప్పారు. కాగా ఈ పాట ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పారు..

English summary
janasena chief pawankalyan posted a cinema song criticizing the ap sand policy and construction workers‘ suicides
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X